Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

కణ్వమహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట

చ.
ుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు
సూడఁగన్.౯౪

సత్యము యొక్క గొప్పతనాన్ని ఎంతో బాగా వివరించిన పద్యం. మనందరం రోజూ మననం చేసుకోవాల్సిన పద్యం. శకుంతల దుష్యంతునితో సత్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పిన పద్యం.

ఎట్టి సాధ్వులకును బుట్టినయిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు
వ.
కావున నీ విక్కుమారుం దోడ్కొని నీ పతిపాలికి నరుగు మని మహాతపోధను లైన తన శిష్యులం గొందఱఁ దోడు వంచిన శకుంతలయు దౌష్యంతుం దోడ్కొని దుష్యంతుపాలికి వచ్చి సకలసామంతమంత్రిపురోహిత ప్రధానపౌరజనపరివృతుం డై యున్న యా రాజుం గనుంగొని. ౬౭

కణ్వ శిష్యులు తోడురాగా భరతునితో శకుంతల దుష్యంతుని రాజసభకు వచ్చింది.
క.
గురునాశ్రమంబునను ము, న్నరుదుగఁ బతివలనఁ గనినయనురాగము నా
దరణము ననుగ్రహంబును, గరుణయు సంభ్రమము నపుడు గానక యెదలోన్
. ౬౮

పూర్వం కణ్వాశ్రమం లో అరుదుగా నైనా పతివలన కనిన అనురాగము కానీ, ఆదరణ కానీ, అనుగ్రహం కానీ, కరుణ కానీ, సంభ్రమం కానీ ఆతని మొహంలో కనిపించక అప్పుడామె మనసులో ఇలా అనుకొందట.
క.
ఎఱుఁగఁడొకొనన్ను నెఱిఁగియు, నెఱుఁగనియట్లుండునొక్కొ యెడ దవ్వగుటన్
మఱచెనొకొ ముగ్ధు లధిపులు, మఱవరె బహుకార్య భారమగ్నులు గారే.
౬౯

నన్ను ఎఱగడా? ఎఱగనట్లున్నాడా? చాలాకాలం అయింది కాబట్టి ఒకవేళ మఱచిపోయాడా ? రాజులు తెలివిలేని వారు కాబట్టి మఱిచిపోయారేమో ఎన్నోకార్యాలలో నిమగ్ను లై ఉండటం చేత.
చ.
తలఁపగ నాఁడు పల్కిన విధం బెడఁ దప్పఁగ వీడెనొక్కొ చూ
డ్కులు విరసంబు లై కరము క్రూరము లై ననిమిత్త మేమియో
కలయఁగ బల్కరించి రుపకారులు నై రని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియు లైన ధరాధినాధులన్.౭౦

ఆరోజు పలికిన మాటల్ని విడిచిపెట్టేసాడా ఏమిటి? ఇతని చూపులు విరసంగా కనిపిస్తున్నాయి. అంతే కాదు. కడు క్రూరంగా కూడా వున్నాయి. కారణం ఏమిటో తెలియదు. రాజులు మనల్ని పలకరించారు, మనకు ఉపకారం చేసారు అని వారిని బుద్ధిమంతులైన వారు నమ్మి ఉండకూడదు. ఎందుకంటే వారు నవ ప్రియులు. ఎప్పుడూ కొత్తంటే పడిచస్తారు కనక. అనుకుంది ఆవిడ.
వ.
అని తలంచి చింతా క్రాంత యై శకుంతల వెండియు నాత్మగతంబున ౭౧
ఇంకా మనసులో ఇలా అనుకుందట.
క.
మఱచినఁ దలఁపింపఁగ నగు, నెఱుఁగని నాఁ డెల్ల పాట్ల నెఱిఁగింప నగున్
మఱి యెఱిఁగి యెఱుఁగ నొల్లని, కఱటిం దెలుపంగఁ గమలగర్భుని వశమే. ౭౨

నిజంగా మర్చిపోతే గుర్తు చేయవచ్చు, ఎరక్కపోతే ఎలాగోలా తెలుసుకొనేలా చేయొచ్చు. తెలిసి వుండికూడా తెలియనట్లుగా ఉండే దుర్మార్గుడికి తెలియచెప్పటం ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు.
వ.
అయినను వచ్చి మిన్నక పోవంగాదు కావున నా పూర్వవృత్తాంతం బెల్ల నెఱింగించి యే నిక్కుమారుం జూపుదు నని మనంబున నిశ్చయించి శకుంతల యా రాజున కి ట్లనియె. ౭౩
క.
జననాథ వేటనెపమున, గొనకొని కణ్వాశ్రమమునకున్ వచ్చి ముదం
బున నందు నాకు నీయి,చ్చిన వరము దలంప వలయుఁ చిత్తము లోనన్. ౭౪

వేట నెపంతో కణ్వాశ్రమమునకు వచ్చినపుడు నీవు నాకు ఇచ్చిన వరాన్ని గుర్తుకు తెచ్చుకో మహారాజా అన్నది.
క.
బాలార్క తేజుఁ డగు నీ,బాలుఁడు నీ కొడుకు వీనిఁ బౌరవకులర
త్నాలంకారు నుదారగు,ణాలయు యువరాజుఁ జేయు మభిషేకమునన్. ౭౫

ఈ బాలుడు నీ కొడుకు. అందుచేత వరము ఇచ్చిన విధంగా వీనికి యౌవరాజ్యపట్టాభిషేకం జరిపించాల్సింది. అన్నది.
వ.
అనిన విని దుష్యంతుడు దాని నంతయు నెఱింగియు నెఱుంగని వాఁడపోలె ని ట్లనియె.౭౬

ఇక్కడ కథను కొంత మార్చి కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలాన్ని వ్రాసారు. మునీశ్వరు శాపం వలన దుష్యంతుడు మరచినట్లుగా వ్రాయటం జరిగింది. వ్యాస భారతంలో ఎలా ఉన్నదో నాకు తెలియదు.
క.
ఏ నెఱుఁగ నిన్ను నెక్కడి, దానవు మిన్నకయ యనుచితంబులు వలుకం
గా నేల యరుగు మంబురు, హానన యెందుండి వచ్చి తందులకు వడిన్. ౭౭

నేను నిన్ను ఎఱగనే ఎఱగను పొమ్మన్నాడు. ఎక్కడినుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళిపొమ్మన్నాడు.

ఇటువంటి శకుంతలల కథలు అప్పటినుండి ఇప్పటివరకూ ఎన్నో ఎన్నెన్నో... అలా కొనసాగుతూనే ఉన్నాయి.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

దుష్యంతుండు శకుంతలను వివాహంబు సేసికొనఁ గోరుట

ఆ.వె.
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు

పతులకడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయుఁ బతుల చూవె.౬౬

ఎటువంటి పతివ్రతలకైనా పుట్టినింటిలో ఎక్కువకాలం ఉండటం తగదు. సతులకు ఉండాల్సిన చోటు వారి వారి భర్తల యింటిలోననే. సతులకు ఏడుగడ కూడా పతులే అవుతారు. ఇవి శకుంతలను భర్త దగ్గరకు పంపేటప్పుడు కణ్వమహర్షి పలికిన పలుకులు.

శకుంతల ముని కన్యకాదు క్షత్రియ కన్య అని వినినంతనే దుష్యంతుండు మదనాతురుం డయి తనయం దక్కోమలి యనురాగం బుపలక్షించి యి ట్లనియె.
ఉ.
ఈ మునిపల్లె నుండు టిది యేల కరం బనురాగ మొప్పఁగా
భామిని నాకు భార్య వయి భాసురలీల న శేషరాజ్యల

క్ష్మీ మహనీయసౌఖ్యముల మేలుగ నందు మనిందితేందుపా

దామలతుంగ హర్మ్యముల హారి హిరణ్మయ కుట్టిమంబులన్.
౫౪
అనిందిత ఇందుపాద=దూషింపరాని చంద్రకిరణములవలె
సీ.
బ్రాహ్మంబు దైవంబుఁ బరఁగ నార్షంబుఁ బ్రాజాపత్యమును రాక్షసంబు నాసు
రంబు గాంధర్వంబు రమణఁ బైశాచంబు నను నెనిమిది వివాహములయందుఁ

గడుఁ బ్రసస్తములు సత్క్షత్త్రవంశ్యులకు గాంధర్వ రాక్షసములు ధర్మయుక్తి

నీకును నాకును నెమ్మిఁ బరస్పరప్రేమంబు కాముండు పెంపఁ దొడఁగెఁ.

ఆ.వె.
గాన నెడయుఁ జేయఁగా నేల గాంధర్వ, విధివివాహమగుట వినవె యుక్త
మనిన లజ్జఁ జేసి యవనతవదనయై, యాలలితాంగి యిట్టులనియెఁ బతికి.
౫౫

ఉన్న ఎనిమిది రకాలైన వివాహాలలో గాంధర్వము, రాక్షసము అనే రకాలు క్షత్రియులకు ఉత్తమమైనవి అందుచేత మనమిద్దరం గాంధర్వ విధిని వివాహమాడదాం అంటాడామెతో దుష్యంతుడు. దానికామె జవాబుగా
క.
కరుణానిరతులు ధర్మ, స్వరూపు లింతకు మదీయజనకులు సనుదెం
తురు వారు వచ్చి నీ కి, చ్చి రేని పాణిగ్రహణము సేయుము నన్నున్
.౫౬
వ.
అనిన దానికి దుష్యంతుం డి ట్లనియె.౫౭
తే.
తనకుమఱితాన చుట్టంబు తాన తనకు, గతియుఁదన్నిచ్చుచోఁ దానకర్తయనఁగ
వనజనేత్ర గాంధర్వ వివాహమతిర,హస్యమును నమంత్రకమునునగుచు నొప్పు.

తనకు మఱి తానే చుట్టమనీ, తనకు తానే గతి యనిన్నీ, తననిచ్చుకొనేటప్పుడు తానే కర్త యని, గాంధర్వ వివాహం అతి రహస్యంగా జరగాల్సి ఉన్న క్రతువనీ, దానికి మంత్రాలతో ప్రమేయం లేదనీ చెపుతాడు.
వ.
అని దుష్యంతుండు గాంధర్వ వివాహస్వరూపంబు సెప్పి శకుంతల నొడంబరచిన నది యి ట్లనియె.౫౬
చ.
నరనుత నీ ప్రసాదమున నా కుదయించిననందనున్ మహీ
గురుతరయౌవరాజ్యమునకున్ దయతో నభిషిక్తుఁ జేయఁగా
వరము ప్రసన్నబుద్ధి ననవద్యముగా దయసేయు నెమ్మితో
నిరుపమదాన య ట్లయిన నీకును నాకును సంగమం బగున్.౫౯
మంచి తెలివితేటలతో వరాన్ని బాగానే అడిగింది శకుంతల.
వ.
అనిన విని శకుంతల కెంతయు సంతోషంబుగా దానికోరిన వరం బిచ్చి గాంధర్వ వివాహంబున నభిమతసుఖంబు లనుభవించి యక్కోమలి వీడ్కొని నిన్నుఁ దోడ్కొని రా నస్మత్ప్రధానవర్గంబుఁ గణ్వమహామునిపాలికిం బుత్తెంచెద నని యూఱడ నొడివి దుష్యంతుండు నిజపురంబునకుం జనియె నిట శకుంతలయుఁ దన చేసినదాని మునివరుం డెఱింగి యలిగెడునో యని వెఱచుచుండె నంత నమ్మహాముని వనంబుననుండి కందమూలఫలంబులుగొని చనుదెంచి లలిత శృంగారభావంబున లజ్జావనత వదనయు నతిభీతచిత్తయునై యున్న కూఁతుం జూచి తన దివ్యజ్ఞానంబున నంత వృత్తాంతంబు నెఱింగి క్షత్త్రియులకు గాంధర్వవివాహంబు విధిచోదితంబ యని సంతసిల్లి శకుంతల కి ట్లనియె.౬౧
తే.
తల్లి నీకులగోత్ర సౌందర్యములకుఁ, దగినపతిఁ గంటి దానికిఁ దగఁగ గర్భ
మయ్యె నీదుగర్భమునవాఁడఖిలభువన, వహన మహనీయుఁడగు చక్రవర్తి సుమ్ము.౬౨
వ.
నీధర్మ చరితంబునకు మెచ్చితి నీవు గోరిన వరం బిచ్చెద వేఁడు మనిన శకుంతలయు నాచిత్తం బెప్పుడు ధర్మువునంద తగిలియుండను నా కుద్భవిల్లెడు పుత్త్రుండు దార్ఘాయురారోగ్యైశ్వర్యబల సమన్వితుండును వంశకర్తయుఁ గావలయు ననిన నమ్మహాముని కరుణించి దానికోరిన వరం బిచ్చి యఛాకాలవిథుల గర్భసంస్కార రక్షణంబులు సేయించి యున్నంత వర్ష త్రయంబు సంపూర్ణం బైన శకుంతలకు భరతుం డుదయించి కణ్వ నిర్వర్తిత జాతకర్మాది క్రియాకలాపుండయి పెరుఁగుచుఁ గరతలాలంకృతచక్రుండును జక్రవర్తి లక్షణ లక్షితుండును సింహ సంహననుండును దీర్ఘ బాహుండును ననంతజవసత్త్వ సంపన్నుండు ను నై పరఁగుచు.౬౩
మూడు సంవత్సరాలు గర్భంలో ఉన్నాడట భరతుడు. బాప్ రే.
మ.
అమితోగ్రాటవి లోనఁ గ్రుమ్మరు వరాహ వ్యాళ శార్దూల ఖ
డ్గ మదేభాదులఁ బట్టి తెచ్చి ఘనుఁ డై కణ్వాశ్రమోపాంతభూ
జములం దోలిన కట్టుచుం బలిమి మై శాకుంతలుం డొప్పె వ
న్యమదేభంబుల నెక్కుచుం దగిలి నానా శైశవ క్రీడలన్.౬౪

ఎక్కువ దుర్గమమైన అడవులలో సంచరించే అడవి పందులను, పాములను, పులులను, ఖడ్గమృగాల్ని, మదించిన ఏనుగుల్ని పట్టి తెచ్చి కణ్వాశ్రమ సమీపంలోని చెట్లకు కట్టివేసి గొప్ప బలంతో శాకుంతలుడు మదించిన ఏనుగులూ వగైరాలనెక్కి ఆడుతూ శైశవ క్రీడలతో అందగించాడట.
వ.
ఇట్లు వనంబులోని సర్వసత్త్వంబులను దన మహాసత్త్వంబునం జేసి దమియించుచున్న యాతనిం జూచి యాశ్చర్యం బంది యందలి మును లెల్ల నాతనికి సర్వ దమనుం డనునామంబుఁ జేసిరి. కణ్వమహా మునియు నక్కుమారు నుదార తేజో రూప విక్రమ గుణంబులకు సంతసిల్లి వాఁ డఖిల భువన యౌవరాజ్యాభిషేకంబునకు సమర్థుండగు(సమయం బరుగు) దెంచె నని విచారించి యొక్కనాఁడు గూఁతున కి ట్లనియె. ౬౫
ఆ.వె.
ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను, బెద్దకాల మునికి తద్ద తగదు

పతులకడన యునికి సతులకు ధర్మువు, సతుల కేడుగడయుఁ బతుల చూవె.౬౬











Unknown
ఆది పర్వము-చతుర్ధాశ్వసము-3

శకుంతల దుష్యంతునకు తన జన్మక్రమం బెఱింగించుట

మథురాక్కర.
తనర జనకుండు నన్న ప్రదాతయును భయత్రాత
యును ననఁగ నించులకు మువ్వు రొగిన గురువులు వీర

లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు

ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
.49

శకుంతల దుష్యంతునకు తన జన్మక్రమాన్ని తెలియజేస్తూ చెప్పిన విషయంలోనిదీ పద్యం.

దుష్యంతుడు అలా తనవారిని బయటనే నిలిపివుంచి కణ్వమహాముని దర్శనార్థం ఆశ్రమం లోనికి ప్రవేశిస్తాడు. అక్కడతనికి మునీశ్వరుని దర్శనం కాలేదు కాని తన్వి, పయోజదళాయతాక్షి, సంకుల మిళితా ళినీల పరికుంచిత కోమల కుంతల ఐన శకుంతల దర్శనం అవుతుంది.
ఆమె దుష్యంతుని నెఱింగి ఆసన అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి కుశలం బడుగుతుంది. అప్పుడామెతో దుష్యంతుడు--
ఉ.
క్రచ్చఱ వేట వచ్చి యిట కణ్వమహామునిఁ జూచి పోవఁగా
వచ్చితి మెందుఁ బోయిరొకొ వా రనినన్ విని యా లతాంగి వా

రిచ్చటనుండి యీక్షణమ యేగిరి కానకుఁ బండ్లు దేర మీ

వచ్చు టెఱింగిరేని జనవల్లభ వారును వత్తు రింతకున్.
౨౭

వేటకోసమై వచ్చి కణ్వమహామునుల దర్శనంకోసం వచ్చాను. వారు యెక్కడకు వెళ్ళారో యిచట లేరు అనగా నామె వారిప్పుడే పండ్లు తేవటానికని అడవికి వెళ్ళారు. మీరొచ్చినట్టు తెలిసినవారై యిప్పుడే తిరిగి వస్తూంటారు. వారు వచ్చేవరకూ ఓ ముహూర్తకాలం వేచివుండాల్సిందని ప్రార్థిస్తుంది. ఆమె వినయానికి సంతసించి ఆమె రూపగుణ విశేషాలచే సంచలితుం డైన రాజు ఆమెను నీ వెవ్వరి కూతురవు యిట్టి గుణసుందరిని నీవు ఇక్కడికెలా వచ్చేవు అని అడుగుతాడు. దానికి శకుంతల
క.
జగతీ వల్లభ యే న,త్యగణితధర్మ స్వరూపుఁ డని జనములు దన్
బొగడఁగ జగదారాధ్యుం, డగు కణ్వమునీంద్రు నాత్మజ ననినన్
.౨౯
చ.
ఇది ముని కన్యక యేని మఱియేలొకొ యీ లలితాంగియందు నా
హృదయము దద్దయుం దవిలె నిప్పలు కింతను నమ్మ నేర న

య్యెద విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు నంచుఁ దా

నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్.
౩౦
వ.
ఇట్లు దుష్యంతుం డాశకుంతలజన్మం బెఱుంగ వేఁడి వెండియు దాని కి ట్లనియె.౩౧
తే.
ఉత్తమాశ్రమనిష్ఠితుఁ డూర్ధ్వ రేతుఁ, డైన కణ్వమహాముని యనఘచరితుఁ
డట్టిముని కెట్లు గూఁతుర వైతి దీని, నాకు నెఱుగంగఁ జెప్పుము నలిననేత్ర
.౩౨

ఈమె మునికూతురనని అంటున్నది. అదే నిజమయితే మఱి నా మనస్సు ఈమె యందు ఎలా లగ్నం అవుతుంది? ఈమాట నమ్మదగినదిగా లేదు. ఈ ముని విజితేంద్రియుడని చాలాసార్లు విన్నాను కదా. అసలు నిజమేమిటో తెలుసుకోవాలి అని దుష్యంతుడు మనసులో అనుకున్నాడు. అలా అనుకొని ఆమెతో ఇలా అన్నాడు.
కణ్వులవారు ఉత్తమమైన ఆశ్రమాన్ని పాటించేవారు, మరియు ఊర్ధ్వరేతస్కుడూ అని విని ఉన్నాం. అటువంటి అనఘ చరితుడూ పుణ్యాత్మునకు నీవు కుమార్తె వెలా అయ్యావు.
వ.
అని యడిగిన నా రాజునకు శకుంతల యి ట్లనియె.౩౩
క.
ఇక్కమలాక్షి శకుంతల, యెక్కడియది దీనిజన్మ మెవ్విధ మని త
మ్మొక్క మునినాథు డడిగిన, నిక్కాశ్యపు లర్థిఁ జెప్పి రేను వినంగన్.
౩౪
వ.
నా జన్మ ప్రకారంబు మాయయ్య యమ్మునికిం జెప్పిన విధంబు చెప్పెదఁ జిత్తగించి విను మని యా దుష్యంతునకు శకుంతల యి ట్లనియె.౩౫

శకుంతల మేనకా విశ్వామిత్రుల కథను దుష్యంతునకు చెపుతుంది.

రాజర్షియై, బ్రహ్మర్షి భావము బడసియున్న విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేస్తున్న సమయాన దేవేంద్రుడు ఆతని తపస్సునకు వెఱచి మేనక అనే అప్సరసను పిలిచి ఆతని తపస్సును భగ్నం చేయమని నియమిస్తాడు. దానికి ఆమె వశిష్ఠునంతవానిని అనపత్యుడవు గమ్మని శపించినంతటి ఉగ్రకోపిష్టి యైన విశ్వామిత్రుని కడకు నన్ను పంపించటం న్యాయం కాదంటూనే నాశక్తికొలది ప్రయత్నిస్తానని చెప్పి మేనక మందమలయానిలం తోడుగా విశ్వామిత్రుని తపోవనం చేరుతుంది. తరువాత కథ మామూలే. విశ్వామిత్రుని దీక్ష భగ్నమై విశ్వామిత్ర మేనకల సంయోగంతో వారిద్దరికీ ఓ ఆడశిశువు జన్మిస్తుంది. మేనక ఆ కన్యకను మాలిని అనే నదీతీరంలో వదలిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు కూడా ఆ శిశువును విడిచిపెట్టి వెళ్ళిపోగా
ఆ.
చెలఁగి లేవ నేడ్చు చిఱుతుక దానిఁ గ్ర,వేయాద ఘోరమృగము లశనబుద్ధిఁ
బట్టకుండఁ జెట్టుపలఁ గప్పి రక్షించు, కొని శకుంతతతులు గూడి యుండె.౪౭
చెట్టుపలఁ=ఱెక్కల చేత
వ.
అంత నేను శిష్యగణంబులతోడ సమిత్కుసుమఫలాహరణార్థం బక్కడకుం జని యమ్మాలినీపులినతలంబుమన శకుంతరక్షిత యై యున్న కూతుఁనత్యంత కాంతిమతి నవనీతలంబున కవతరించిన తరుణశశిరేఖయుం బోలినదాని నెత్తుకొని వచ్చి శకుంతరక్షిత యగుటం జేసి శకుంతల యనునామం బిడి కరంబు గారవంబునం బెనిచితిమి.
మథురాక్కర.
తనర జనకుండు నన్న ప్రదాతయును భయత్రాత
యును ననఁగ నించులకు మువ్వు రొగిన గురువులు వీర

లనఘయుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు

ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు.
4
వ.
అనం బరగిన శాస్త్రార్థంబున నేము దీనికి భయత్రాతల మగుటం జేసి గురుల మిదియును మాచే నభివర్ధిత యగుటం జేసి మాకు హృదయానందని యైన కూఁతురని కణ్వమహామును లమ్మునికిఁ జెప్పినవిధం బంతయు సవిస్తరంబుగా శకుంతల సెప్పిన విని దుష్యంతుం డాత్మగతంబున. ౫౦
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

దుష్యంత మహారాజు చరిత్రము

వ.
ఆ త్రసునకుఁ గాళింది యనుదానికి నిలులుండు పుట్టె వానికి రథంతరి యను దానికి దుష్యంతుండు పుట్టెఁ బుట్టి యనన్య సాధారణ గుణయుక్తుండై.
శా.
ఆ దుష్యంతుఁ డనంత సత్త్వుఁడు సమస్తాశాంత మాతంగమ
ర్యాదాలంకృత మైన భూవలయ మాత్మాయత్తమై యుండఁగా

నాదిత్యాంశుసమీర దుర్గమ మహోగ్రారణ్య దేశాళితో

నాది క్షత్త్ర చరిత్ర నేలె నజితుండై బాహువీర్యంబునన్.

ఆదిత్యాంశుసమీర దుర్గమ=సూర్యరశ్మి గాలియు జొరరాని

ఆ దుష్యంత మహారాజు ఓ పర్యాయం అడవికి వేటకు వెళ్ళి మృగాలను వేటాడుతూ వేట తమకంలో పరివారానికి దూరమై కొద్ది పరిజనం మాత్రమే వెంట రాగా ఓ పుణ్యనదీ తీరంలో వివిధసురభికుసుమ ఫల భారవినమ్రతరులతా గుల్మ పరిశోభితం బయిన యొక్క వనంబు గని ఆ వన సౌందర్యమునకు ముగ్ధుడై ప్రవేశించు నపుడు ఆతనిపై చల్లని గాలివిసరి సేదతీర్యటమే కాకుండా లతలయెక్క పువ్వులు అక్షతలు చల్లి దీవించినట్లుగా అయిందట.

మానిని.
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల ని మ్మగుఠావుల జొంపములన్
బూచిన మంచి యశోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం

గాచి బెడంగుగఁ బండిన యా సహకారములం గదళీ తతులం

జూచుచు వీనుల కిం పెసఁగన్ వినుచున్ శుకకోకిలసుస్వరముల్.౨౦
సహకారములం=తియ్యమామిళ్ళ చేతను

చిగిరించిన గోరంట్లతోనూ, బాగా పూచిన అశోకములతోనూ, సురపొన్నలు పొన్నలతోనూ గేదగి పూవులతోనూ బాగుగా పండిన తియ్యమామిడి పండ్లతోను, అరటి పండ్లతోనూ ఒప్పుతున్న చెట్లనూ లతలనూ చూస్తూ, చిలుకల మరియు కోకిలల కుహూరావాల్ని వింటూ ముందుకు సాగాడు.

కవిరాజవిరాజితము.
చని చని ముందట నాజ్యహనిర్ధృతసౌరభధూమలతాతతులం
బెనఁగిన మ్రాకుల కొమ్మలమీఁద నపేతలతాంతము లై నను బా

యని మధుప ప్రకరంబులఁ జూచి జనాధిపుఁడంత నెఱింగెఁ దపో

వన మిది యల్ల దె దివ్యమునీంద్రు నివాసము నా నగు నంచు నెదన్.
౨౧

ముందుకు వెళ్ళగా వెళ్ళగా అక్కడ నేతితో కూడిన హవిస్సులను అగ్నిలో వేల్చగా వెలువడిన ధూమముతో నిండిన లతలతో వున్న చెట్లకొమ్మల మీద పూవులు లేకున్ననూ పాయని తుమ్మెదలగుంపును చూచి దుష్యంతుడు ఆ ప్రదేశము ఒక ముని ఆశ్రమమని ఎదురుగా కనిపించేది ఆ దివ్యమునీంద్రుని నివాసమని గ్రహించాడు. ఇంకా లోనికి వెళ్ళగా అక్కడ వినిపిస్తున్న హోత్ర స్వాహా శబ్దాల్ని, విద్వత్సంభాషణలను మరియు గోష్ఠీనినాదాల్ని బట్టీ దానిని కణ్వమహాముని ఆశ్రమంగా యెఱిగిన వాడై అందు.
సీ.
శ్రవణసుఖంబుగా సామగానంబులు చదివెడు శుకముల చదువు దగిలి
కదలక వినుచుండు కరులును గరికరశీతలచ్ఛాయఁ దచ్ఛీకరాంబు
కణముల చల్లనిగా డ్పాసపడి వానిఁ జెంది సుఖం బున్న సింహములును
భూసురప్రవరులు భూతబలుల్ దెచ్చి పెట్టు నీవారాన్న పిండతతులు
తే.
గడఁగి భక్షింప నొక్కటఁ గలసియాడు, చున్న యెలుకలుఁ బిల్లులు నొండు సహజ
వైరివర్గంబులయు సహవాసమపుడు, సూచి మునిశక్తి కెంతయుఁ జోద్యమంది.౨౪

అక్కడ చిలుకలు శ్రవణ సుఖంగా సామగానాన్ని చేస్తుండగా కదలకుండా ఆగానాన్ని వింటూవున్నాయట ఏనుగులు.
ఆ ఏనుగులశీతల ఛాయలోని చల్లని నీటితుంపరల గాలికి ఆసపడి ఆ ప్రక్కనే సుఖంగా కూర్చున్నాయట సింహాలు. బ్రాహ్మణులు భూత బలుల కోసం తెచ్చి పెట్టిన నీవారాన్న పిండములను తినడానికై చేరిన యెలుకలు పిల్లులు తమ తమ జాతి వైరాలను విడిచి ఒక్కచో స్నేహంతో మెసలుతున్నాయట. ఈ దృశ్యాల్ని చూచి ఆ ముని శక్తికి అబ్బురపడుతూ
ఈ కశ్యపప్రజాపతి పుత్త్రుండైన కణ్వమునీశ్వరులకు నమస్కరించి వస్తాను మీరంతా ఇక్కడే వుండండని తన పరివారానికి నియమించి కణ్వమునీంద్రుల ఆశ్రమంలోనికి ప్రవేశిస్తాడు దుష్యంతుడు.
Unknown
ఆది పర్వము-చతుర్థాశ్వాసము-

పూరుని వంశ క్రమము

పూరుడు(కౌసల్య)---జనమేజయుడు(౩ అశ్వమేధములు చేసెను, భార్య అనంత)---ప్రాచిన్వంతుడు(ప్రాక్ దిగ్విజయం చేసి ప్రాచీనాంశుడు గా పిలవబడ్తాడు. భార్య నశ్మకి)--- సంయాతి(వరాంగి)--- నహంయాతి(భానుమతి(కృతవీర్యపుత్రి)) --- సార్వభౌముడు(కేకయరాజపుత్త్రి సునంద) ---- జయత్సేనుడు(వైదర్భి యైన సుశ్రవశ) ---- నవాచీనుడు ( విదర్భరాజపుత్త్రి మర్యాద) ---- నరిహుడు(ఆంగి)---- మహాభౌముడు(ప్రసేనుని పుత్త్రిక సుపుష్ట) --- అయుతానీకుడు (పృథుశ్రవసుని పుత్త్రిక కామ) ---అక్రోధనుడు( కాళింగి యైన కరంభ) --- దేవాతిథి( వైదేహి యైన మర్యాద) ఋచీకుడు(ఆంగి యైన సుదేవ) ---ఋక్షుండు(దక్షక పుత్త్రియైన జ్వాల) ---మతినారుడు పుట్టి
క.
ఇమ్ముగ సరస్వతీ తీ,రమ్మునఁ బండ్రెండు వత్సరమ్ములు విధి మా
ర్గమ్మున సద్గుణ సముదా, య మ్మెసఁగఁగఁ జేసె సత్త్రయాగము నిష్టన్.

క.
అతనికి సరస్వతీ నది, మతి ననురక్త యయి వాని మానుగఁ దనకుం
బతిఁ జేసికొనియె ధర్మ, స్థితి నయ్యిరువురకుఁ ద్రసుఁడు ధీరుడు పుట్టెన్.


నదికీ రాజుకూ వివాహం జరగడం ఇదో వింత. నదులు స్త్రీ రూపాల్ని ధరించడం - ఇంకా గంగాదేవి విషయంలో కూడా మునుముందు చూడబోతాం.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౬

ఇంద్రుడు యయాతిని స్వర్గలోక భ్రష్టుం జేయుట

యయాతి మహారాజు పూరుని రాజ్యాభిషిక్తుని చేసిన తరువాత తపోవనమునకేగి శిలోంఛవృత్తి నవలంబించి వేయి సంవత్సారాలు తపస్సు చేసాడు. తరువాత నిరాహారుడయి ౩౦ సంవత్సరాలు, వాయుభక్షకుడుగా వుంటూ పంచాగ్ని మధ్యంలో వుంటూ ఒక సంవత్సరము, నీటిలో ఏకపాదము మీద నిలబడి ఇంకొక్క సంవత్సరము తపస్సు చేసి దివ్యవిమానంలో స్వర్గలోకం చేరి దేవర్షిగణ పూజితు డై, అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మర్షి పూజితుండై అనేక కల్పములు అక్కడ గడిపి తిరిగి ఇంద్రలోకానికి వచ్చాడు. ఇంద్రుడు అప్పుడతడిని ఈవిధంగా అడిగాడు.
శిలోంఛవృత్తి=ఱాళ్ళపైనిగింజల నేఱికొనుజీవనముచే
క.
ఏమితపం బొనరించితి, భూమీశ్వర పుణ్యలోక భోగంబులఁ దే
జోమహిమ ననుభవించితి, సామాన్యమె శత సహస్రసంవత్సరంబుల్.
౨౦౮
వ.
అనిన నయ్యింద్రున కయ్యయాతి యి ట్లనియె.౨౦౯
క.
సుర దైత్య యక్ష రాక్షస, నర ఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భా
సురతపములు నా దగు దు,ష్కర ఘోరతపంబు సరియుఁ గా వమరేంద్రా
.౨౧౦
వ.
అని తన తపోభిమానంబున మహర్షు లతపంబు లవమానించి పలికిన నయ్యయాతి గర్వంబునకు సహింపక యింద్రుం డలిగి నీకు దేవలోక సుఖానుభవంబులందుఁ బుణ్యసమాప్తి యయ్యె నీ గర్వంబు నిన్నింత సేసె నింక నధోలోకంబున కరుగుమనిన వాఁడును మనుష్యలోకంబునకుం బోవనోప నంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండునట్లుగా నాకుఁ బ్రసాదింపు మని యింద్రు ననుమతంబు వడసి.౨౧౧
సద్భువనంబున=సత్ భువనంబున=సత్ అనులోకమున
తే.
అంతరిక్షంబు నఖిల దిగంతములును
వెలుగఁ జనుదెంచునాతని విమల దీప్తి
సూచి సద్గణములు గడుఁ జోద్యమంది
రురుతరద్యుతి యిదియేమియొక్కొ యనుచు.౨౧౨

యయాతి స్వర్గాన్నుండి వచ్చేటప్పుడు అతనిని ఆవరించి ఉన్న కాంతిని అందరూ అబ్బుర పడుతూ చూచారట.
వ.
అంత నయ్యాయతి దౌహిత్రులైన యష్టకుండును బ్రతర్ధనుండును వసుమంతుండును నౌశీరనుం డయినశిబియు నను వారలు సద్భువుననివాసులు దమయొద్దకుం జనుదెంచిన యయాతి నధిక తేజోమయు ననంతమూర్తిం గని నిసర్గ స్నేహంబున నభ్యాగతపూజల సంతుష్టుం జేసి నీ వెవ్వండ వెందుండి యేమికారణంబున వచ్చితని యడిగిన వారలకు
నయ్యయాతి యి ట్లనియె.౨౧౩

అప్పుడు యయాతి వారికి తాను నహుష పుత్త్రుడు పూరుని తండ్రి యైన యయాతిగా పరిచయం చేసుకొని యింద్రుని తోడి తన సంభాషణని వివరించి తాను సురసిద్ధ మునీంద్రుల తపశ్చరణలు తన తపముతో సరిగావని చెప్పడాన్ని వివరించి,
చ.
అమరవిభుండు దాని విని యల్గి మదంబున ను త్తమావమా
నము దగునయ్య చేయ నని నన్ను నధోభువన ప్రపాతసం
భ్రమ వివసాత్ముఁ జేసె నదిపాడియ యెందును నల్పమయ్యు ద
ర్పము బహుకాలసంచిత తపః ఫలహాని యొనర్పకుండునే.౨౧౭

దర్పము ఎంతహానిని కలిగిస్తుందో చెపుతాడు.

అప్పుడు వారు అతనికి తమను అతని దౌహిత్రులుగా పరిచయం చేసుకుని అతనిని సకల ధర్మాధర్మములు, సుగతి దుర్గతి స్వరూపములు, జీవుల గర్భోత్పత్తి ప్రకారము,వర్ణాశ్రమ ధర్మముల గురించి వివరించమని కోరతారు.

ఆ.
సర్వభూతదయకు సత్యవాక్యమునకు, నుత్తమంబు ధర్ము వొండెఱుంగ
నొరులనొప్పి కోడ కుపతాప మొనరించు, నదియ కడు నధర్మ మనిరి మునులు.౨౧౯

సర్వ భూతములయందు దయ, సత్యవాక్యము వీనిని మించిన ధర్మం ఇంకొకటి తనకు తెలియదన్నాడు.ఇతరులకు నొప్పిని బాధను కలిగించటాన్ని కడు అధర్మమన్నారు పెద్దలు.
ఆ.
వేదవిహిత విధుల నాదరించుట యూర్థ్వ, గతికిఁ దెరువు విధులఁ గడచియెందు
నాఁగఁబడిన వాని లోగఁగఁ జేయుట, యధమగతికి మార్గమనిరి మునులు.౨౨౦

వేదాలలో విధించబడిన కార్యములను చేయుట పైగతి నొందడానికి మార్గమని మునులు చెప్పారు. నిషేధింపబడిన వానిని ఆచరించుట అధమగతికి మార్గమని కూడా చెప్పారు.
వ.
మఱియు గర్భ యోనియందు ఋతుపుష్పరససంయుక్తం బగుచు రేతంబు గాడ్పు చేతం బ్రేరేపితం బయి కలసిన నందుఁ బంచతన్మాత్రలు పొడ వయి క్రమంబున నవయవంబు లేర్పడి లబ్ధజీవులయి యుద్భవిల్లి శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును ద్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును నెఱుంగుచుఁ బూర్వకర్మనియోగంబున దుష్కృతంబును సుకృతంబును జేయుచు దుష్కృతబాహుళ్యంబునఁ బుణ్యంబు గీడ్పఱిచి బుద్ధివిరహితంబు లైన తిర్యగ్యోనులందుఁ బుట్టుదురు. సుకృత బాహుళ్యంబునఁ బాపంబు గీడ్పఱచి బుద్ధియుక్తు లై మనుష్య యోనులందుఁ బుట్టి యుక్తాచారులును దత్త్వవిదులును నయి దేవత్వంబును పొంది విశుద్ధ జ్ఞానులయి ముక్తులగుదురు మఱి యుక్తాచారులెవ్వరనిన గురుశుశ్రూష సేయుచు నిత్యాధ్యయనాగ్ని కార్యంబులయం దప్రమత్తులయి శమదమశౌచంబులు దాల్చి యవిప్లుత బ్రహ్మచర్యులయిన బ్రహ్మచారులును బాపంబునకుఁ బరోపతాపంబునకు వెఱచి ధర్మ్యంబైన విత్తంబున నతిథులం బూజించుచుయజ్ఞంబులు సేయుచుఁ బరుల యీనిధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠాన పరులయిన గృహస్థులును నియతాహారులై సర్వసంగంబులు విడిచి జితేంద్రియు లైన వానప్రస్థులును వనంబులనుండి గ్రామ్యవస్తువుల నుపయోగింపక గ్రామంబులనుండి శరీరధారణార్థంబు నియతస్వల్పభోజనులయి నగర ప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులం బొరయక శౌచాలంక్రియారతు లయి సర్వద్వంద్వంబులు నొడిచి సర్వసంగ విసర్జితులయి యేక చరు లయి యనేకనికేతను లయినయతులును ననువీరలు దమతమ పుణ్యాచారంబులలం జేసి క్రిందం బదితరంబులవారిని మీఁదం బదితరంబులవారిని దమ్మును నుద్ధరింతురు గావున.౨౨౧
స్త్రీ గర్భంలో ఋతుకాలమందలి పుష్పరసంతో రేతస్సు గాలిచేత ప్రేరేపింపబడి కలిసిన అందు పంచతన్మాత్రలు రూపాన్ని పొంది క్రమంగా అవయవాలేర్పడి పుట్టినవాడై చెవులద్వారా శబ్దాన్ని, కన్నులద్వారా రూపాన్ని, ముక్కు ద్వారా వాసనని, నాలుక ద్వారా రుచిని, చర్మం ద్వారా స్పర్శను, మనస్సు ద్వారా సర్వాన్ని తెలుసుకుంటూ పూర్వము చేసిన కర్మలవలన పాపాల్ని పుణ్యాల్ని చేస్తూ పాపకర్మలు యెక్కువగా చేస్తే పుణ్యకర్మలని హరిస్తూ బుద్ధి లేని జంతుజాలంలో పుడుతూ పుణ్యకర్మాచరణం అధికంగా చేస్తే అవి పాపకర్మలను హరించగా బుద్ధిని కలిగుండే మానవ జన్మ పొందుతూ యుక్తాచారులూ తత్త్వవిదులూ అయితే దేవత్వాన్ని పొందుతూ ఉంటారు. యుక్తాచారు లెవరయ్యా అంటే ౧. గురుశుశ్రూష చేస్తూ నిత్యమూ అధ్యయన అగ్ని కార్యాలలో జాగరూకులయి శమదమశౌచాల్నితాల్చి సడలని బ్రహ్మచర్యవ్రతాన్ని పాటించేబ్రహ్మచారులును, ౨.పాపానికి ఇతరుల కపకారం చేయడానికి భయపడుతూ ధర్మమార్గంలో మాత్రమే సంపాదించిన ధనంతో అతిథులను పూజిస్తూ యజ్ఞాల్ని చేస్తూ పరులు ఇవ్వని ధనాన్ని పరిగ్రహించక నిత్యానుష్ఠాన పరులయిన గృహస్థులును, ౩. తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ అన్ని సంగాల్ని విడిచి జయింపబడిన ఇంద్రియాల్ని కలిగిన వానప్రస్థులును, ౪. అడవులలో నివసిస్తూ గ్రామ వస్తువులనుపయోగించకుండా గ్రామాల్లో ఉంటూ శరీరాన్ని నిలబెట్టుకోడానికి మాత్రమే సరిపడే ఆహారాన్ని స్వీకరిస్తూ నగర ప్రవేశాన్ని పరిహరించి కామక్రోధాల్ని పొందకుండా శౌచాల్ని పాటిస్తూ అన్ని ద్వందాల్ని ఒడిసి పట్టి వివర్జితులయి ఏకచరులయి అనేక గృహాల్ని కలిగిన యతీశ్వరులును--అనబడే వీరంతా తమ తమ పుణ్యాచారాల్ని బట్టి అటు పది తరాల్ని యిటు పది తరాల్ని తమనూ ఉద్ధరించుదురు. కావున.
క.
మానాగ్నిహోత్రమును మఱి, మానాధ్యయనమును మానమౌనంబును వి
జ్ఞానమున మానయజ్ఞము, నా నయథార్థంబు లివియు నాలుగు నుర్విన్.221
మాన=గౌరవింపదగిన
గౌరవింపదగిన యజ్ఞము, అధ్యనము, మౌనము, యజ్ఞము ఇవి నాలుగూ యథార్థమయినవి. అని యయాతి వారికి ఉపదేశిస్తాడు.
ఆది పర్వము తృతీయాశ్వాసము సమాప్తము.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౫

ఇంద్రుడు స్వర్గానికి వచ్చిన యయాతితో యిట్లనియె.
క.
కొడుకు జవ్వనంబు గొని నీవు నిజరాజ్య, భూరిభరము వానిఁ బూన్చునప్పు
డతని కెద్ది గఱపి తని యడిగిన హరి, కయ్యయాతి యిట్టు లనుచుఁ బలికె.౨౦౨

పూరుడిని రాజ్యాభిషిక్తుడిని చేసినప్పుడు అతనికి ఏమేం బుద్ధులు కరపావో చెప్పమంటా డింద్రుడు యయాతిని.

యయాతి పూరునకు బోధించిన నీతులు
క.
ఎఱుక గలవారిచరితలు, గఱచుచు సజ్జనులగోష్ఠిఁ గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిగినవానిని, మఱవ కనుష్ఠించునది సమంజసబుద్ధిన్.౨౦౩

పెద్దల చరిత్రలు తెలుసుకుంటూ, సుజనులతోడి సంభాషణల్లో పాలుపంచుకుంటూ ధర్మాన్ని తెలుసుకుంటూ, తెలుసుకున్న దానిని మంచిబుద్ధితో ఆచరిస్తూ ఉండాలి.
క.
ఇచ్చునది ధనము పాత్రున, కచ్చుగ నొరు వేఁడ కుండునది యభిముఖు లై
వచ్చినయాశార్ధుల వృథ, పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్.౨౦౪

పాత్రుడైన వానికే ధనాన్ని ఇవ్వాలి. అపాత్రదానం కూడదు. ఇతరులనెప్పుడూ యాచించకుండా వుండాలి. ఆశించి వచ్చిన వారిని వృథ పుచ్చకుండా సర్వభూతములకు హితమైన వానినే చేస్తూ ఉండాలి.
క.
మనమునకుఁ బ్రియంబును హిత, మును బథ్యముఁదథ్యమును నమోఘమధురం
బును బరిమితమును నగుపలు, కొనరఁగఁ బలుకునది ధర్మయుతముగ సభలన్.౨౦౫

సభలలో మాట్లాడవలసిన విధానాన్ని నిర్దేశిస్తున్నాడు చూడండి.
మనసుకు ప్రియాన్ని హితాన్ని కలిగించేవి, పథ్యమయ్యేవి, తథ్యమయ్యేవి, అమోఘమైనవి, మధురమైనవి, పరిమితమైనవి, అయ్యే పలుకులనే ధర్మయుతముగా ఒప్పేటట్లుగా సభలలో పలకాలి.
సీ.
వదన బాణాసన వ్యక్తముక్తము లై న పలుకు లన్కడువాఁడి బాణతతులఁ
బరమర్మ లక్ష్యముల్ పాయక భేదించు చుండెడు దుర్జనయోధవరుల
కడ నుండకున్నది కరుణ యార్జవ మక్షజయము సత్యంబును శమము శౌచ
మను వీని యెద నిల్పునది శత్రుషడ్వర్గజయ మందునది శుద్ధశాంతబుద్ధి
తే.
మదముఁ గామంబు గ్రోధంబు మత్సరంబు
లోభమును మోహమును నను లోని సహజ
వైరి వర్గంబు నొడిచినవాఁడ యొడుచు
నశ్రమమంబున వెలుపలి యహితతతుల.౨౦౬
ఉన్నది=ఉండునది
ఆర్జవము=ఋజుభావము
అక్షజయము=ఇంద్రియజయము
ఒడిచిన=ఓడించిన
నోటినుండి వెలువడే బాణాల్లాటి మాటలతో ఇతరుల మర్మ లక్ష్యాలను భేదించే చెడ్డవారి దగ్గర ఉండకూడదు. మనసులో ఎప్పుడూ కరుణ, ఋజు భావము, ఇంద్రియజయము, సత్యం, శమము, శౌచము- వీనినే నిలుపుకోవాలి. శుద్ధమైన శాంతబుద్ధితో అరిషడ్వర్గాలను జయించాలి. మదము, కామము, కోపము, అసూయ, లోభము, మోహము అనే మనలోని సహజమైన శత్రువర్గాన్ని ఓడించినవాడే బయటి అహితాల్నికూడా శ్రమ లేకుండా జయించగలుగుతాడు.

ఇవీ యయాతి తన కొడుకునకు ఉపదేశించిన ఉపదేశాలు. మనందరం మన పిల్లలకు కూడా ఇవన్నీ చెప్దామా.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౪
యయాతి యదుప్రముఖులకు శాపం బిచ్చుట
క.
తనయుండు తల్లిదండ్రులు, పనిచినపని సేయఁడేని పలు కెదలోఁ జే
కొనఁడేని వాఁడు తనయుం, డనఁబడునే పితృధనమున కర్హుం డగునే.౧౯౯

వ.
ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి కొడుకుల నెల్ల రావించి నాకు విషయసుఖతృప్తి లే కున్నయది గావున మీ యందొక్కరుండు నా ముదిమి గొని తన జవ్వనంబు నా కిచ్చునది యనిన విని యదుతుర్వసుద్రుహ్వ్యానులు దండ్రి కిట్లనిరి.
ఆ.
తగిలి జరయు రుజయు దైవవశంబున, నయ్యెనేని వాని ననుభవింత్రు
గాక యెఱిఁగి యెఱిఁగి కడఁగి యా రెంటిఁ జే, కొందురయ్య యెట్టికుమతులైన.౧౯౩
క.
నరలు గల కాము నైనను, దరుణులు రోయుదురు డాయ ధనపతి యయ్యుం
బురుషుఁడు దుర్వారజరా, పరిభూతి నభీష్టభోగబాహ్యుఁడ కాఁడే.౧౯౪
నరలు=తెల్లనివెండ్రుకలు

ముసలితనము, రోగము అనేవి దైవవశాత్తు కలిగితే వాటిని అనుభవించాల్సిందే కాని ఎరిగి ఎరిగి పూనుకొని మరీ ఆ రెండింటినీ ఎంత బుద్ధిహీనులైనా కోరి భరించ సిద్ధపడతారా?
తెల్లవెండ్రుకలు కలిగుంటే వాడు సాక్షాత్తు ఆ కాముడైనా సరే తరుణులు అసహ్యించుకుంటారు. ఎంత డబ్బున్న వాడైనా భరింపరాని ముసలితనాన్ని కలిగినవాడు కోరిన కోరికలకు వంచితుడు కాకతప్పదు గదా.
వ.
అని యొడంబడ కున్న నలిగి యయాతి యదువంశంబునవారు రాజ్యంబున కయోగ్యులుగాఁ దుర్వసు వంశంబునవారు ధర్మాధర్మ వివేకశూన్యు లై సంకీర్ణ వర్ణ కిరాతులకు రాజులుగా ద్రహ్యువంశంబు వారు డుపప్ల వసంతార్యం బైన దేశంబునకు రాజులుగా జరాదూషకుండగుట ననువంశంబునవారు ముదియునంతకు నుండక జవ్వనంబునన పంచత్వంబున కరుగువారునుంగా శాపంబిచ్చి
యానలువురకుం గొండొకవాని శర్మిష్ఠా పుత్త్రుఁ బూరుం బిలిచి యడిగిన వాడు తండ్రి కోరినయట్ల చేసిన నవయౌవనుం డై యయాతి యభిమతసుఖంబులు సహస్ర వర్షంబు లనుభవించి తృప్తుం డై పూరుజవ్వనంబు వానికి నిచ్చి తన జరాభారంబుఁ దాన తాల్చి నిజాజ్ఞా విధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్త్రాది వర్ణ ముఖ్యుల నెల్ల రావించి మంత్రి పురోహితసామంతానంత పౌరజనసమక్షంబున సకల క్షోణీచక్ర సామ్రాజ్యంబునకుఁ బూరు నభిషిక్తుం జేసిన సర్వప్రకృతిజనంబు లారాజున కి ట్లనిరి.౧౯౫
ఉడుపప్లవ సంతార్యంబు=పడవులు తెప్పలచే దాటదగినది
పంచత్వంబునకు=మరణమునకు
మ.
అవిచారం బని పల్క నోడెదము ధర్మాభిజ్ఞ నీయగ్ర సం
భవుఁ డత్యున్నత శక్తియుక్తుఁడు మహీభార ప్రగల్భుండు భా
ర్గవ దౌహిత్రుఁ డు పాత్రుఁ డీ యదుఁడు లోక ఖ్యాతుఁ డుండంగ నీ
భువనేశత్వభరంబుఁ బూన్పఁ దగునే పూరున్ జఘన్యాత్మజున్.౧౯౬
జఘన్యాత్మజున్=నిందితసుతుని
పెద్దకొడుకు భార్గవుని మనుమడు ఉండగా వానిని కాదని నిందిత యైన శర్మిష్ఠ చివరికొడుకుకు రాజ్యం ఇవ్వడం ఎలా సబబు అని ప్రజలంతా అడిగారు రాజుగారిని.
వ.
అనిన వారల క య్యయాతి యి ట్లనియె.౧౯౭
క.
యదుఁ డగ్ర తనూజుఁడు నా, హృదయసముద్భవుఁడు వాఁ డయిన మద్వచనం
బిది యేటిది యని కడు దు,ర్మదుఁ డై చేయక కృతావమానుండయ్యెన్.౧౯౮

పెద్దకొడుకై ఉండీ దుర్మదు డై తండ్రి యాజ్ఞను పాలించకపోవటం చేత అవమానం పాలవ్వాల్సిన వాడవ్వాల్సి వచ్చింది అంటాడు.
అలా అంటూ ఈ విధంగా పైన చెప్పినట్లుగా అంటాడు.
.
తనయుండు తల్లిదండ్రులు, పనిచినపని సేయఁడేని పలు కెదలోఁ జే
కొనఁడేని వాఁడు తనయుం, డనఁబడునే పితృధనమున కర్హుం డగునే.౧౯౯
క.
పూరుఁడు గొండొక యయ్యును, భూరిగుణ జ్యేష్ఠుఁడును సుపుత్త్రుఁ డు నవనీ
భార సహిష్ణుఁడు నాతఁడ, కోరిన కార్యంబుఁ దీర్చి కుశలుండగుటన్.౨౦౦
గొండొక=చిన్నవాడు
వ.
నా జరాభారంబుఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు శుక్రు వచనంబు నిట్టిద యని యయాతి ప్రకృత జనులనొడంబఱిచి పూరును రాజుగా చేసెను.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-13
క.
చను బొంకఁగఁ బ్రాణాత్యయ, మున సర్వధనాపహరణమున వధగా వ
చ్చిన విప్రార్థమున వధూ, జనసంగమమున వివాహసమయములందున్
.౧౭౮
ఆ.
వారి జాక్షులందు వై వాహికములందుఁ
బ్రాణ విత్త మాన భంగ మందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొంద దధిప.!౫౮౪

ఇందులో మొదటి కంద పద్యం శ్రీమదాంధ్రమహాభారతం లో శర్మిష్ఠ యయాతి మహారాజుతో అంటుంది. రెండవ ఆటవెలది పద్యం వామనావతార ఘట్టంలో శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో అంటున్నది. మొదటిది మునివచనం అని శర్మిష్ఠ అంటుంది. రెండవది శుక్రాచార్యులు స్వయంగా చెప్పిన విషయం. "సత్యం వద " అనే వేదవాక్యానికిదో అపవాదం లాంటిది. దీనినే పెద్దలు శుక్రనీతిగా పరిగణిస్తారు.
శర్మిష్ఠ తన కన్యకాసహస్రంతో దేవయానికి దాసిగా నియమింపబడిన తర్వాత ఓ రోజు యయాతి మహారాజు అడవిలో దాహంతో తిరుగుతున్నపుడు అనిలు డనే దూత చేత దేవయాని దగ్గఱకు తీసుకొని రాబడతాడు. అప్పుడు దేవయానిని గుర్తించి, శర్మిష్ఠ గురించి అడగ్గా ఆమెను వృషపర్వుని పుత్రికగా తన దాసిగా పరిచయం చేస్తుంది. ఇంకా తమ పాత పరిచయాన్ని గుర్తు చేసి యయాతి తన దక్షిణ హస్తంతో దేవయాని దక్షిణ హస్తాన్ని పట్టుకొని రక్షించడం వలన తమ కిద్దరికీ ఇదివరకే పెళ్ళయినట్లే నంటూ తనను పెళ్ళిచేసుకోమని దేవయాని యయాతిని కోరుతుంది. దానికి యయాతి క్షత్రియుడైన తాను బ్రాహ్మణ కన్యను వివాహమాడ్డం ధర్మ విరుద్ధం అంటాడు. పైగా తాను వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడాల్సిన రాజు కాబట్టి అలా పెళ్ళిచేసుకోవటం భావ్యం కాదంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ వివాహం ధర్మ సమ్మతమేనంటే చేసుకుంటావు గదా అని అంటుందామె. అలాగే నంటాడతను. అప్పుడు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి అవివాహంలో అపక్రమదోషం లేకుండా వరమిస్తాడు. అలా వరమిచ్చి వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. శర్మిష్ఠను కన్యకాసహస్రంతో పాటుగా యయాతికి అంపకం పెడుతూ ఆమెకు అన్నపానభూషణాచ్ఛాదనమాల్యానులేపనాదుల సంతోషంబు సేయమని శయనవిషయంబున పరిహరించమని చెప్పి పంపిస్తాడు.
కాలక్రమంలో దేవయాని యందు యయాతికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు కొడుకులు కలుగుతారు.

ఒకనాడు శర్మిష్ఠ సంప్రాప్త యౌవనయు ఋతుమతియు నై దేవయాని అదృష్టాన్ని తలచుకొని ఇలా అనుకుంటుంది.
క.
పతిఁ బడసి సుతులఁ బడయఁగ, నతివలు గోరుదురు గోరినట్టుల తనకుం
బతిఁ బడసి సుతులఁ బడసెను, సతులీ భార్గవికి భాగ్యసంపద నెనయే.౧౭౧
తరువోజ.
ఈరాజునంద నాహృదయంబు దవిలియెప్పుడు నుండు నన్నీతఁడు గరము
కారుణ్యమునఁ బ్రీతిగలయట్లు సూచుఁ గమలాక్షి భార్గవకన్య దా నెట్లు
గోరి యీతనిఁ దనకును బతిఁ జేసికొనియె నట్టుల యేను గోరి లోకైక
భారధురంధరుఁ బరహితధర్మపరు నహుషాత్మజుఁ బతిఁ జేసికొందు.౧౭౨

దేవయాని యయాతిని ఎలా వివాహమయ్యిందో అలానే తను కూడా యయాతిని పెళ్ళాడాలనుకుంది శర్మిష్ఠ.
అవకాశం దొరకగానే నన్నేలిన దేవయానికి నీవు భర్తవు కాబట్టి నాకు కూడా నీవు భర్తవే ఆ దేవయానిని పరిగ్రహించినపుడే నేనామె ధనాన్నగుటచే నేనుభవత్పరిగ్రహంబనే అంటుంది. కావున తనకు ఋతుకాలోచితాన్ని ప్రసాదించమంటుంది. యయాతి ఇలా అంటాడు.
క.
లలితాంగి శయన మొక్కఁడు, వెలిగా రుచిరాన్న పాన వివిధాభరణా
దుల శర్మిష్ఠకు నిష్టము, సొలయక చేయు మని నన్ను శుక్రుఁడు పంచెన్.౧౭౬
సొలయక=వెనుదీయక
వ.
ఏ నమ్మహామునివచనంబున కప్పు డొడంబడితి నెట్లు బొంక నేర్తు ననిన శర్మిష్ఠ యయాతితో పైన చెప్పిన విధంగా అన్నదట.
.
చను బొంకఁగఁ బ్రాణాత్యయ, మున సర్వధనాపహరణమున వధగా వ
చ్చిన విప్రార్థమున వధూ, జనసంగమమున వివాహసమయములందున్
.౧౭౮

చెప్పొచ్చేదేంటంటే
శుక్రనీతి (అవసరార్ధం మార్పుచేసుకొనేది) శుక్రుని కూతురు కాపురానికే ఎసరు పెట్టిందన్నమాట.
క్రమక్రమంగా యయాతి వలన శర్మిష్ఠకు ద్రుహ్యనుపూరులనే ముగ్గురు కొడుకులు యయాతి పోలికలతో పుడతారు.
వారిని చూచి విషయం తెలుసుకొన్న దేవయాని తన తండ్రికి పిర్యాదు చేస్తుంది. శుక్రాచార్యులు కోపించి యయాతికి జరాభారపీడితుండవు కమ్మని శాపమిస్తాడు.
క.
ఋతుమతియై పుత్త్రార్థము, పతిఁ గోరినభార్యయందుఁ బ్రతికూలుం డై
ఋతువిఫలత్వము సేసిన, నతనికి మఱి భ్రూణహత్య యగునంఢ్రు బుధుల్.౧౮౮
క.
దానికి భీతుఁడ నై య, మ్మానవతీ ప్రార్థనం గ్రమం బొనరఁగ సం
తానము వడిసితి నెదలో, దీనికి నలుగంగఁ దగునె దివ్యమునీంద్రా.౧౮౯
వ.
ఏ నిద్దేవయానియందు విషయోపభోగతృప్తుండఁ గాను జరాభారంబుఁ దాల్ప నోపనని ప్రార్థించిన విని వానికి శుక్రుండు గరుణించి యట్లేని నీముదిమి నీకొడుడులయం దొక్కరునిపయిం బెట్టి వానిజవ్వనంబు నీవు గొని రాజ్యసుఖంబు లనుభవింపుము నీవు విషయోపభోగతృప్తుండ వైన మఱి నీముదిమి నీవ తాల్చి వాని జవ్వనంబు వానికి నిచ్చునది. నీ ముదిమిఁ దాల్చిన పుత్త్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయు నగు ననిన నయ్యయాతి శుక్రు వీడ్కొని దేవయానీ సహితుం డై తన పురంబునకు వచ్చి శుక్రు శాపంబున జరాభారంబుఁ దాల్చిన వానికి.౧౯౦
క.
తల వడఁక దొడఁగె నింద్రియ, ములగర్వ మడంగె నంగములు వదలె వళీ
పలితంబు లయ్యె వగరును, దలయేరును నుక్కిసయును దలకొనుదెంచెన్.౧౯౧

వళీపలితంబు=ముడుతలు నరయును
వగరును=ఉబ్బసమును
తలయేరును=తలనొప్పియును
ఉక్కిసయును=పొడిదగ్గును
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౨
యయాతి నూతం బడిన దేవయాని నుద్ధరించుట

క.
అనుపమ నియమాన్వితు లై, యనూనదక్షిణలఁ గ్రతుసహస్రంబులు సే
సినవారికంటె నక్రో,ధనుఁడు గరం బధికుఁ డండ్రు తత్త్వవిధిజ్ఞుల్
.౧౪౬

గొప్ప నియమాలతోకూడి సాటిలేని దక్షిణలను ఇచ్చిన వారికంటే కోపిస్టి కానివాడు చాలా గొప్పవాడని తత్త్వవిధిజ్ఞులు అంటారు.
క.
అలిగిన నలుగక యెగ్గులు, వలికిన మఱి విననియట్ల ప్రతివచనంబుల్
వలుకక బన్నమువడి యెదఁ, దలఁపక యున్నతఁడ చూవె ధర్మజ్ఞుఁ డిలన్.
౧౪౭

ఎదుటివారు కోపగిస్తే తను కోపగించకుండా వుండి, వాళ్ళేమయినా నిందావాక్యాలు పలికితే వానిని విననియట్లే ప్రతివచనములేమీ పలకకుండా ఉన్నవాడే లోకంలో ధర్మజ్ఞుడనబడతాడు.
వ.
ఇట్లు దేవయాని నుద్ధరించి యయాతి నిజపురంబువ కరిగె నిట దేవయానియు శర్మిష్ఠ సేసిన యెగ్గువలన విముక్తయయి తన్ను రోయుచు వచ్చుదాని ఘూర్ణిక యను పరిచారికం గని యేను వృషపర్వుపురంబు సొర నొల్ల శర్మిష్ఠచేత నాపడిన యవమానంబు మదీయజనకున కెఱింగింపు మని పంచిన నదియును నతిత్వరితగతిం జని తద్వృత్తాంతంబంతయు శుక్రునకుం జెప్పిన శుక్రుండును నాక్షణంబ కోపఘూర్ణితబాష్పపూరితనయన యై యున్న దేవయానింగని యీ పై చెప్పిన విధంగా అన్నాడు.౧౪౫

శర్మిష్ఠ చేసిన అవమానాన్ని సహించి తిరిగి వృషపర్వుని రాజ్యంలో అడుగే పెట్టనని దేవయాని తండ్రికి వర్తమానం పంపిస్తే శుక్రాచార్యులవారు వెంటనే అక్కడికివచ్చికూతురిని అనునయిస్తూ పై చెప్పిన నీతివాక్యాలను చెప్తాడు.
వ.
కావున బుద్ధిగలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు శర్మిష్ఠ రాచకూఁతురు గొండొకయది దానితోడి దేమి రమ్మనిన దేవయాని యిట్లనియె.౧౪౮
క.
కడుననురక్తియు నేర్పును, గడఁకయుఁ గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివెడువివేకశూన్యుల, కడ నుండెడునంతకంటెఁ గష్టము గలదే.౧౪౯

అనురక్తి, నేర్పు, యత్నము కలవారిని ఊరికే నిందలు పలికే వివేకములేని వారివద్ద ఉండటం కంటే కష్టం ఇంకోటేదీ ఉండదు.
అందుచేత వృషపర్వుని రాజ్యంలో తానుండలేనని యెక్కడ కైనా వెళ్ళిపోతానంటుంది దేవయాని. అలాగైతే నీతోపాటే నేనూను అని వాళ్ళిద్దరూ బయలుదేరబోతారు. ఇదంతా చారులవలన విన్న వృషపర్వుడు వేగంగా అక్కడికి వచ్చి శుక్రాచార్యులను తమని వీడి పోవద్దని, వారేమి కోరితే అది యిస్తానని వరమిస్తాడు. అప్పుడు దేవయాని శర్మిష్ఠ తన కన్యకాసహస్రంతో కూడా తనకు దాసి కావాలని వరం కోరుతుంది. రాజు శర్మిష్ఠను పిలిచి ఆమెను కన్యకాసహస్రంతో పాటుగా దేవయానికి దాసిగా ఉండేట్లు ఏర్పాటు చేస్తాడు.
ఆరోజుల్లో బ్రాహ్మణులకు రాజులు అంత వినయవిధేయలతో ఉండేవారు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౧
యయాతి నూతం బడిన దేవయాని నుద్ధరించుట
వ.
ఇట వృషపర్వుకూఁతురు శర్మిష్ఠ యను కన్యక యొక్కనాఁడు కన్యకాసహస్రపరివృత యయి దేవయానీసహితంబు వనంబునకుం జని యొక్కసరోవరతీరంబునఁ దమతమ పరిధానంబులు పెట్టి జలక్రీడ లాడుచున్న నవి సురకరువలిచేతం బ్రేరితంబు లయి కలిసిన నొండొరులం గడవఁ గొలను వెలువడు సంభ్రమంబున నక్కన్యక లన్యోన్యపరిధానంబులు వీడ్వడం గొని కట్టునెడ దేవయానిపుట్టంబు శర్మిష్ఠ గట్టికొనిన మఱి దానిపరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం జూచి యిట్లనియె.౧౩౪
కన్యకాసహస్రపరివృత యయి= వేయిమంది కన్యలను చుట్టనూ కలిగి ఉన్నదై
పరిధానంబులు=వస్త్రములు
సురకరువలిచేతం=సుడిగాలి చేత
ప్రేరితంబై=ప్రేరేపింపబడినవై
కడవఁ=దాటుటకు
క.
లోకోత్తర చరితుం డగు, నాకావ్యుతనూజ నీకు నారాధ్యను నేఁ
బ్రాకటభూసురకన్యక, నీకట్టినమైల గట్ట నేర్తునె చెపుమా
.౧౩౫
లోకోత్తరమైన చరిత్ర కలిగిన శుక్రాచార్యుల కూతురనైన నేను నీకు ఆరాధనీయను. నేను నీ మైల చీరను ఎలా ధరిస్తాననుకొన్నావు. అని దేవయాని శర్మిష్ఠను అడిగింది.
వ.
అనిన శర్మిష్ఠ యి ట్లనియె.౧౩౬
క.
మాయయ్యకుఁ బాయక పని, సేయుచు దీవించి ప్రియము సేయుచు నుండున్
మీయయ్య యేటి మహిమలు, నాయొద్దనె పలుక నీకు నానయు లేదే.౧౩౭

విడిచిపెట్టకుండా మా అయ్యకు మీ అయ్య పనిచేసి దీవించి ప్రియమును చేస్తూ ఉంటాడు. మీ అయ్య మహిమలు నాదగ్గర చెప్పటానికి నీకు సిగ్గెలా లేదే అన్నది శర్మిష్ఠ దేవయానితో.
వ.
నా కట్టిన పుట్టంబు నీకుం గట్టంగాదు గాకేమి యని గర్వంబున నెగ్గులాడి దేవయాని నొక్కనూతం ద్రోచి శర్మిష్ఠ కన్యకాసహస్రపరివృత యయి క్రమ్మఱి వచ్చి నిజవాసంబున నుండె.౧౩౮.
ఎగ్గులాడి =నిందించి
ఇలా ఉండగా నహుషాత్మజు డైన యయాతి వేటాడుతూ వేటాడుతూ దప్పిగొని నీటికొఱకై దేవయాని పడియున్న నూతిదగ్గరకు వచ్చి నూతిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆమెను చూచి నీవెవరవు ఎవ్వరిదానవు అని అడుగుతాడు. అప్పుడామె అంతకు పూర్వం వేటకు వచ్చిన అతనిని చూచివున్నకారణంగా అతనిని గుర్తుపట్టి ఇలా అంటుంది.
తరలము.
అమర సన్నిభ యేను ఘోరసురాసురాహవభూమి య్యమరవీరుల చేత మర్దితు లైన దానవులన్ గత భ్రములఁగాఁ దనవిద్య పెంపునఁ బ్రాప్తజీవులఁ జేసి త్యమితశక్తిమెయిన్ వెలింగినయట్టి భార్గవుకూఁతురన్.౧౪౨
వ.
దేవయాని యనుదానఁ బ్రమాదవశంబున నిన్నూతం బడి వెలువడ నేరకున్న దానను న న్నుద్ధరించి రక్షింపు మనిన నవ్విప్రకన్యకయందు దద్దయు దయాళుండై.౧౪౩

యయాతి ఆమెకు తన దక్షిణహస్తాన్ని చాచి ఆమెను బయటకు తీసి రక్షించి తన దారిని తాను వెళతాడు.

Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౧౦
దేవయాని కచుడు ఒకరినొకరు శపియించుకొనుట
కచుడు శుక్రాచార్యుల యొద్ద మృతసంజీవని విద్య నేర్చి శుక్రుడిని బ్రతికించిన తర్వాత చాలా కాలం గురుని సేవించి స్వర్గలోకానికి తిరిగి వెళ్ళటానికి గురుని అనుమతి పొంది, దేవయానికి కూడా వీడ్కోలు పలకడానికి వస్తాడు. అప్పుడామె అతనితో--
ఉ.
నీవును బ్రహ్మచారివి వినీతుఁడ వేనును గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయది పన్నుగ నన్నుఁ బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయఁ జేయుము నాకుఁ బ్రియంబు నావుడున్.౧౨౯

క.
ఆ కచుఁ డత్యంత విషా,దాకులుఁ డై లోకనింద్య మగు నర్థము నీ
వాకునకుఁ దెచ్చు టుచితమె, నాకు సహోదరివి నీవు నాచిత్తమునన్.౧౩౦
క.
గురులకు శిష్యులు పుత్రులు, పరమార్థమ లోకధర్మపథ మిది దీనిం
బరికింపక యీపలుకులు, తరుణీ గురుపుత్రి నీకుఁ దగునే పలుకన్.౧౩౧
వ.
అనిన నాకచునకు దేవయాని కరం బలిగి నీవు నామనోరథంబు విఫలంబుగాఁ జేసినవాఁడవు నీకు సంజీవని పనిసేయ కుండెడుమని శాపం బిచ్చినఁ గచుం డేను ధర్మపథంబు దప్పనివాఁడను నీవచనంబున నాకు సంజీవని పనిసేయ దయ్యెనేని నాచేత నుపదేశంబు గొన్నవారికిఁ బనిసేయుంగాక మఱి నీవు ధర్మవిరోధంబు దలంచితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు గాకుండెడు మని దేవయానికిఁ బ్రతిశాపం బిచ్చి తత్క్షణంబ.౧౩౨

క.
దేవగురునందనుం డమ, రావాసంబునకు నరిగి యమరులకును సం
జీవని యుపదీశించి సు, ధీవిభుఁ డొనరించు చుండె దేవహితంబుల్.133
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౯
యయాతి మహారాజు చరిత్రము
తే.
వర్ణధర్మముల్ గాచుచు వసుధయెల్ల, ననఘచరితుఁ డై యేలిన యయ్యయాతి
భూసురోత్తమ భార్గవపుత్రి యైన, దేవయానిని దా నెట్లు దేవిఁ జేసె.౯౭
తే.
విపుల తేజంబునను దపోవీర్యమునను, జగదనుగ్రహనిగ్రహ శక్తియుక్తుఁ
డయినయట్టియయాతికి నలిగియేమి, కారణంబున శాపంబు కావ్యుఁడిచ్చె.౯౮

రాజైన యయాతి బ్రాహ్మణుడు గురుడు అయిన శుక్రాచార్యుని పుత్రిక నెలా పెళ్ళాడాడు.విపుల తేజస్కుడు తపోమహిమతో అనుగ్రహ నిగ్రహశక్తియుక్తుడైన యయాతికి ఏ కారణం వలన శుక్రుడు శాపమిచ్చాడు. అని అడిగాడు జనమేజయుడు వైశంపాయనుడిని.
వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు.
పూర్వం వృషపర్వుడనే దానవ పతికి శుక్రుడు ఆచార్యు డై దేవతలకు విరోధియైన ఆ దానవపతికి ప్రియాన్ని చేకూరుస్తుండే వాడు. దేవతలతో జరిగిన యుద్ధాలలో మరణించిన అందరు రాక్షసులను తన దగ్గర ఉన్న మృత సంజీవని అనే విద్య ద్వారా ఎప్పటికప్పుడు తిరిగి బ్రతికిస్తుండేవాడు. అలా చేయటం వలన రాక్షస సైన్యాన్ని జయించటం దేవతలకు అసాధ్యంగా ఉండేది. ఈ కారణం చేత దేవతలు అందరూ ఆ మృతసంజీవని విద్యను శుక్రాచార్యుల దగ్గరనుండి నేర్చుకొని రావడానికని బృహస్పతి కుమారుడైన కచుడిని నియోగిస్తారు. శుక్రాచార్యునికి అతని కూతురు దేవయాని అంటే విరీతమైన ఫ్రేమ అనీ ఆమె అనుగ్రహం పొంది ఆమె ద్వారా ఆ విద్యను శుక్రాచార్యుని వద్ద నుండి నేర్చుకుని రావలసిందని అతనిని పంపుతారు.
కచుడు శుక్రుని వద్దకు వెళ్ళి తనను బృహస్పతి కుమారునిగా పరిచయం చేసుకొని తనని శిష్యునిగా స్వీకరించి చదువు చెప్పమని ప్రార్థిస్తాడు. అతని వినయనిధేయతలు వగైరాలతో సంతృప్తి చెందిన శుక్రుడు అతనిని సేవిస్తే బృహస్పతిని సేవించినట్లేనని తలచి అతణ్ణి శిష్యుడుగా అంగీకరిస్తాడు.
సీ.
పని యేమి పంచినఁ బదపడి చేసెద ననక తన్ బంచిన యాక్షణంబ
చేయుచు నిజగురుచిత్తవృత్తికిఁ గడు ననుకూలుఁ డై వినయంబుతోడ
మనమునఁ జెయ్వులమాటల భక్తి నేకాకారుఁ ఢై మఱి యంతకంటె
దేవయానికి సువిధేయుఁ డై ప్రియహితభాషణములఁ బుష్ప ఫలవిశేష
ఆ.
దానములను సంతతప్రీతిఁ జేయుచు, నివ్విధమునఁ బెక్కు లేండ్లు నిష్ఠ
గురుని గురుతనూజఁ గొలిచి యయ్యిరువుర, నెమ్మి వడసెఁ దనదు నేర్పు పేర్మి.౧౧౦

గురువును సేవించుకోవాల్సిన విధం విపులంగా తెలియజేయబడిందిక్కడ.

కచుడిలా గురువుగారికి ప్రియ శిష్యుడుగావటం సహించలేని దానవులు అతనినెలాగైనా మట్టు పెట్టాలని ఓసారి అడవికి వెళ్ళినపుడు అతనిని అడవిలో చంపివేసి ఓ చెట్టుకు కట్టివేసి తిరిగి వస్తారు. అందరితో పాటుగా కచుడు తిరిగి రాకపోవటం చూచి దేవయాని తండ్రికి ఆ విషయం తెలియపరుస్తుంది. దివ్యదృష్టితో జరిగినది తెలిసికొన్న శుక్రుడు అతనిని తన మృతసంజీవని విద్య ద్వారా బ్రతికిస్తాడు. ఈసారి ఇలా కాదని దానవులు కచుడిని చంపి దహనం చేసి ఆ బూడిదను సురలో కలిపి శుక్రునికిస్తారు. శుక్రుడది త్రాగుతాడు. సాయంత్రం మళ్ళీ దేవయాని గొడవ పెడితే శుక్రుడు కచునికోసం దివ్యదృష్టితో వెదకి వెదకి చివరకు సురతో కలిసి తన పొట్టలో ఉండడాన్ని గ్రహిస్తాడు. అప్పుడు శుక్రాచార్యులు మద్యసేవను నిరసిస్తూ ఇలా కట్టడి చేస్తాడు.
ఆ.
మొదలి పెక్కు జన్మములఁ బుణ్యకర్మముల్, పరఁగఁ బెక్కు సేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనుల కాక్షణమాత్రన, చెఱుచు మద్య సేవ సేయ నగునె.౧౨౦
క.
భూసురు లాదిగఁ గలజను, లీసుర సేవించి రేని యిది మొదలుగఁ బా
పాసక్తిఁ బతితు లగుదురు, చేసితి మర్యాద దీనిఁ జేకొనుఁడు జనుల్.౧౨౧

అని శుక్రాచార్యులు సురాపానము మహాపాపమని శపించి, కచునకు కడుపులో ఉండగానే మృతసంజీవనిని ఉపదేశించి తన పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి తనని అదే విద్య ద్వారా తిరిగి బ్రతికించమంటాడు. కచుడు ఆవిధంగానే చేస్తాడు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౯
కౌరవ వంశ వివరణము
చ.
నిరుపమ ధర్మమార్గపరినిష్ఠితు లై మహినెల్లఁ గాచుచుం
బరఁగినతొంటిపూరు కురుపాండుమహీశుల పేర్మిఁ జేసి భూ

భరవహనక్షమం బగుచుఁ బౌరవకౌరవపాండవాన్వయం

బురుగుణసంపదం బెరిఁగి యొప్పె సమస్తజగత్ప్రసిద్ధమై.
౮౮

దక్షుని కూతురు అదితి+కశ్యప ప్రజాపతి-----వివస్వంతుడు----వైవస్వతుడు(మనువు)---యముడు, శనైశ్చరుడు, యమున, తపతి పుట్టారు.
వైవస్వతుడు-----బ్రహ్మ క్షత్త్రియ వైశ్య శూద్రాదులైన మానవులు పుట్టిరి. ఇంకా వేనుడు మొదలుగాగల ౫౦ మంది రాజులు పుట్టి వంశకరులై తమలోన తాము యుద్ధం చేసి చనిపోయారు.
వైవస్వతుడు---ఇల(పుత్రిక)+బుధుడు(సోమపుత్రుడు)---పురూరవుడు . ఇతడు చక్రవర్తియై పాలించి ధనలోభముతో విప్రోత్తముల ధనాన్నపహరిస్తాడు. దానిని సరిచేయాలని సనత్కుమారుడు ముని సంఘంతో బ్రహ్మలోకాన్నుండి వస్తే వారికి దర్శనం ఇవ్వడు. అప్పుడు వారతనిని ఉన్మత్తుడుగా కమ్మని శపిస్తారు.
ఈ పురూరువునకు ఊర్వశికి ఆయువు, ధీమంతుడు, నమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అని 6గురు కలుగుతారు.
ఆయువునకు స్వర్భానవి యనుదానికి నహుషుడు, వృద్ధశర్మ, రజుడు, గయుడు, ఏనసుడు, అని 5గురు పుడతారు.
వీరిలో నహుషుడు చక్రవర్తి అవుతాడు. నూఱు క్రతువులు చేసి దేవేంద్రత్వాన్ని కూడా పొందుతాడు.
ఈ నహుషునకు ప్రియంవద అనే ఆమె వల్ల యతి, యయాతి, సంయాతి, యాయాతి, త్యయతి, ధృవుడు ఇలా 6గురు
పుడతారు.
వీరిలో యయాతి రాజై అనేక యాగములు చేసి శుక్రపుత్రి యయిన దేవయాని యందు యదు తుర్వసులను ఇద్దఱు కొడుకులను, వృషపర్వపుత్రి యయిన శర్మిష్ఠ యందు ద్రుహ్య, అను, పూరుడు అని 3గ్గురు కొడుకులను కంటాడు.యయాతి తఱువాత శుక్ర శాపం వలన జరాభారపీడితుడవుతాడు. అప్పుడు నహుషుడు కొడుకులనందరినీ పిలిచి ఇలా అంటాడు.
సీ.
విషయోపభోగాభింషణ మింకను నాకు వదలక పెరుగుచున్నదియుఁ గాన
నందనులార మీయం దొక్క రుండు నా దగుజరాభారంబు దగిలి తాల్చి
తనజవ్వనంబు నా కొనరంగ నెవ్వఁ డీ నోపు నాతండ సద్వీపసకల
ధారుణీసామ్రాజ్యభారయోగ్యుం డగు నని యడిగిన నగ్ర తనయుఁ డయిన
ఆ.
యదువుఁ దొట్టి సుతులు ముదిమికి నోపక, తలలు వాంచి యున్న వెలయఁ దండ్రి
పనుపుఁ జేసి ముదిమిగొని జవ్వనంబిచ్చెఁ, బూరుడనుసుతుండు భూరియశుఁడు.
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౭
దేవదాన వాద్యంశములచే భూమియందుఁ బుట్టిన వారిక్రమము
క.
యాదవవంశంబున జగ, దాదిజుఁ డగు విష్ణు దేవు నంశంబున ను
త్పాదిల్లెఁ గృష్ణుఁ డపగత, ఖేదుఁడు వసుదేవ దేవకీదేవులకున్.౭౪
దేవ దానవ అంశము యొక్క పేరు/పేరులు భూమియందు పుట్టిన వారల పేరులు
విష్ణువు-------------------------------------కృష్ణుఁడు
అనంతుడు(విష్ణువు అంశతో)------------------బలదేవుడు
లక్ష్మి----------------------------------------రుక్మిణి
సనత్కుమారుడు------------------------------ప్రద్యుమ్నుడు
అప్సరసలు-----------------------------------కృష్ణుని షోడశ సహస్రాంతఃపుర వనితలు
వేల్పులు--------------------------------------వృష్ణి యదు భోజాంధక వంశములలోని వీరులు
ప్రభాసుడు(ఎనిమిదవ మనువు)-----------------భీష్ముడు
బృహస్పతి(సురగురువు)------------------------ద్రోణుడు(భరద్వాజుని కుండ యందు)
కామ,క్రోధాదుల ఏకత్వమున---------------------అశ్వత్థామ
ఏకాదశ రుద్రులు--------------------------------కృపాచార్యుడు
సూర్యుడు--------------------------------------కర్ణుడు
ద్వాపర అంశము---------------------------------శకుని
హంసుడు(అరిష్టాపుత్రుడు, గంధర్వ విభుడు)--------ధృతరాష్ట్రుడు
మతి(వేల్పు)------------------------------------గాంధారి
కలి---------------------------------------------దుర్యోధనుడు
పౌలస్త్య భ్రాతృవర్గము----------------------------- దుర్యోధనానుజ శతం
హిరణ్యకశిపుడు---------------------------------శిశుపాలుడు
సంహ్లాదుడు--------------------------------------శల్యుడు
అనుహ్లాదుడు-------------------------------------ధృష్టకేతుడు
శిబి----------------------------------------------దృమసేనుడు
బాష్కలుడు----------------------------------------భగదత్తుడు
విప్రచిత్తి(దానవుడు)--------------------------------జరాసంధుడు
నయశ్శిరుడు,అశ్వశీర్షుడు, నయశ్శంకుడు,
గగన మూర్ధుడు, వేగవంతుడు ఈ ౫ గురు------------కేకయరాజులు
కేతుమంతుడు------------------------------------అమితౌజుడు
స్వర్భానుడు--------------------------------------ఉగ్రసేనుడు
జంభుడు-----------------------------------------విశోకుడు
అశ్వపతి-----------------------------------------కృతవర్మ
వృషపర్వుడు------------------------------------దీర్ఘప్రజ్ఞుడు
అజరుడు----------------------------------------మల్లుడు
అశ్వగ్రీవుడు--------------------------------------రోచమానుడు
సూక్ష్ముడు---------------------------------------బృహద్రథుడు
దుహుడు----------------------------------------సేనాబిందుడు
ఏకచక్రుడు----------------------------------------ప్రతివింద్యుడు
విరూపాక్షుడు-------------------------------------చిత్రవర్మ
హరుండు-----------------------------------------సుబాహుడు
అరిహరుడు---------------------------------------బాహ్లికుడు
చంద్రవక్త్రుండు-------------------------------------ముంజకేశుడు
నికుంభుడు---------------------------------------దేవాపి
శరభుడు-----------------------------------------సోమదత్తుడు
చంద్రుడు-----------------------------------------చంద్రవర్మ
అర్కుడు-----------------------------------------ఋషికుడు
మయూరుడు------------------------------------పశుడు
సుపర్ణుడు---------------------------------------క్రోధకీర్తి
రాహువు----------------------------------------క్రోధుడు
చంద్రహంత--------------------------------------శునకుడు
అశ్వుండు---------------------------------------అశోకుండు
భద్రహస్తుడు-------------------------------------నందుడు
దీర్ఘజిహ్వుండు----------------------------------కాశిరాజు
చంద్రవినాశనుడు--------------------------------జానకి
బలీనుడు---------------------------------------పౌండ్రమత్స్యుడు
వృతృండు--------------------------------------మణిమంతుడు
కాలాపుత్రులు(౮)-------------------------------జయత్సేనాపరాజిత -----------------------------------------------నిషధాధిపతి శ్రేణిమన్మహౌజోభీరుసముద్రసేన బృహత్తులు
క్రోధవశగణం-----------------------------------మద్రక కర్ణవేష్ట సిద్ధార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ
-----------------------------------------------విచిత్ర సురథ శ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మి ------------------------------------------------జనమేజయాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన
------------------------------------------------గోముఖ క్షేమధూర్తి శ్రుతాయు రుద్వహ బృహత్సేన క్షేమాగ్ర తీర్థ
------------------------------------------------కుహర మతిమ ఈశ్వరాదులనేకులు .
కాలనేమి-----------------------------------------కంసుడు
గుహ్యకుడు---------------------------------------శిఖండి
మరుద్గణాంశం------------------------------------పాండురాజు
మరుత్తులు---------------------------------------ద్రుపద,సాత్యకి,విరాటరాజులు
ధర్ముండు-----------------------------------------విదురుడు
సిద్ధి,బుద్ధి------------------------------------------కుంతి,మాద్రిలు
యముడు-----------------------------------------ధర్మరాజు
వాయుదేవుడు-------------------------------------భీముడు
ఇంద్రుడు-------------------------------------------అర్జునుడు
అశ్వినులు------------------------------------------నకుల, సహదేవులు
శ్రీమూర్తి---------------------------------------------యాజ్ఞసేని
అగ్ని------------------------------------------------దృష్టద్యుమ్నుడు


ఆ.వె.
ననఘ యిది సురాసురాంశావతారకీ,ర్తనము దీని వినినఁ దవిలి భక్తి
జదినినను సమస్త జనులకు నఖిల దే,వాసురాదు లిత్తు రభిమతములు.౮౪
Unknown
అరణ్య పర్వము- ప్రథమాశ్వాసము-9
భీమసేన ధర్మరాజుల సంవాదము
ఆ.
బాహుబలము మెఱసి పరులసంపదలు సే, కొనఁగ లావు లేనికుత్సితుండు
నియత దుఃఖవృత్తి నిర్వేదపరుఁడగుఁ, గాక నీకుఁ దగునె? కౌరవేంద్ర.౨౪౧
తే.
తగిలి నిత్యంబు నేకాంతధర్మ నిరతుఁ, డగుట యుక్తమె పురుషున కట్టివాని
వెలయ ధర్మకామంబులు విడుచుఁ బ్రాణ,విగతుసుఖదుఃఖములు రెండు విడుచునట్లు.౨౪౪
ధర్మ కామములు అని కాక అర్ధ కామములు అని వుండాలేమో అని ఓ చిన్న సందేహం.
సీ.
ధర్మ కామంబులు దఁఱుగంగ నర్థార్థి యగువాఁడు పతితుఁ డౌ నర్థ సేవ
నర్థార్థముగఁ జేయునతఁ డుగ్రవనములో గోరక్ష సేయునక్కుమతిఁ బోలు
నర్థధర్మములకు హానిగాఁ గామార్థి యగునాతఁ డల్పజలాశయమున
జలచరం బెట్టు లజ్జలములతోఁ జెడు నట్లు కామంబుతో హాని బొందు
ఆ.
నర్థధర్మములు మహాబ్ధిమేఘములట్టు, లుభయమును బరస్పరోదయమ్ము
లిట్లు గాఁ ద్రివర్గ మెఱిఁగి సామ్యమున సే, వించువాఁడు సర్వ విత్తముండు.౨౪౫
వ.
భవదాచరితం బైన యీధర్మం బర్థకామంబులక కాదు నీకును నీ బాంధవులకును బాధాకరంబు దాన యజ్ఞ సత్పూజలు గావింప నర్థహీనున కశక్యంబు జగంబులు ధర్మమయంబులు ధర్మువునకు మిక్కిలి యొం డెద్దియు లే దయినను నర్థార్థంబు గానిధర్మువు క్షత్రియుల కయుక్తంబు.౨౪౬
ఉ.
శత్రుల నాజి నోర్చుటయు సర్వ భయంబులఁ బొంద కుండఁగా
ధాత్రిఁ బరిగ్రహించి యుచితస్థితిఁ గాచుటయుం బ్రియంబుతోఁ
బాత్రుల కర్థ మీగియును బ్రాహ్మణపూజయుఁ జువ్వె యుత్తమ
క్షత్రియధర్మముల్ సుగతికారణముల్ విపులార్థమూలముల్.౨౪౭
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౬
వ.
అనిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్లనియె.
క.
ఆదిత్య దైత్య దానవు, లాదిగఁ గల భూతరాశి కగు సంభవమున్
మేదినిఁ దదంశముల మ,ర్త్యోదయములు నాకుఁ జెప్పు మొగి నేర్పడఁగాన్
.౫౮

దేవ దానవ ప్రముఖుల యత్పత్తి క్రమము
బ్రహ్మ----(మానస పుత్రులు)------6గురు. మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు.
మరీచి---కశ్యప ప్రజాపతి----చరాచర భూతరాశి ఉద్భవమయ్యింది.
బ్రహ్మ---దక్షిణ అంగుష్ఠం---దక్షుఁడు(పు)
బ్రహ్మ---వామాంగుష్ఠం-----ధరణి(స్త్రీ)
దక్షుడు+ధరణి----౧౦౦౦ సుతులు ---సాంఖ్యయోగాభ్యాసంతో ముక్తులై ఊర్ధ్వరేతస్కులు అయ్యారు.
దక్షుడు+ధరణి----౫౦ మంది కుమార్తెలు కలిగారు
ఈ ౫౦ మందిలో ౧౦ మందిని ధర్ముడనే మనువుకిచ్చి వివాహం చేస్తాడు.
ఈ ౧౦ మంది పేర్లు కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్ఠి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి .
౨౭ మందిని(అశ్విని,కృత్తిక,రోహిణి---మొదలగువారు) చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు.
౧౩ మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తాడు.వీరి వివరాలు.
అదితికి---ద్వాదశాదిత్యులు (ధాతృ, మిత్ర, అర్యమ, శక్ర, వరుణ, అంశు, భగ, వివస్వత, పూష, సవితృ, త్వష్టృ, విష్ణువు)
దితి---హిరణ్య కశిపుడు ----అతనికి 5గురు పుట్టారు(ప్రహ్లాద, సంహ్లాద, అనుహ్లాద, శిబి, బాష్కళుడు)
(-----ప్రహ్లాదునికి---విరోచన, కుంభ, నికుంభు లని ముగ్గురు కలుగుతారు.
-----విరోచనునికి----బలి----బలికి---బాణాసురుడు.)
దనువు-- ౪౦ మంది దానవులు పుడతారు (విప్రచిత్తి, శంబర, నముచి, పులోమాసి, లోమకేశి, దుర్జయ మొదలగువారు)
ఈ దానవుల పుత్ర,పౌత్ర సంతానం అసంఖ్యాకంగా పెరుగుతుంది.
కాల---8గురు పుడతారు(వినాశన, క్రోధ మొదలయినవారు)
అనాయువు---4గురు ముదిమి లేనివారు పుడతారు.(విక్షర, బల, వీర, వృత్రుడు)
సింహిక---రాహువు
ముని----౧౬ గురు గంధర్వులు పుడతారు(భీమసేన, ఉగ్రసేన, మొదలయినవారు)
కపిల---- అమృతం, గోగణం, బ్రాహ్మణులు, ఘృతాచీ, మేనక మొదలుగాగల అప్సరోగణం పుడతారు.
వినత---అనూరుడు, గరుడుడు
(-------అనూరుడు+శేని--సంపాతి, జటాయువు పుడతారు.
క్రోధ---క్రోధవశగణం
బ్రాధ---సిద్ధాదులు పుడతారు.
క్రూర---సుచంద్ర, చంద్రహంతాదులు పుడతారు.
కద్రువ---భుజంగముఖ్యులు పుడతారు(శేష, వాసుకి, మున్నగువారు)

బ్రహ్మ మానసపుత్రుడైన అంగిరసునకు----అయ్యుతథ్యుడు, బృహస్పతి(దేవగురువు), సంవర్తుడు అనే ముగ్గురు కొడుకులు, గుణాశ్రయయోగసిద్ధి అనే కూతురు పుట్టారు.
బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షికి అనేకమంది పరమమునులు పుట్టారు.
పులస్త్యుడనే మానసపుత్రునకు అనేకమంది రాక్షసులు పుట్టారు.
పులహుండనే మానసపుత్రునకు కిన్నరులు, కింపురుషులు పుట్టారు.
క్రతు వనే మానసపుత్రునకు పతంగసహచరులు పుట్టారు.
పైతామహుడైన దేవుండనే మనువునకు ప్రజాపతి పుట్టాడు.
ఈ ప్రజాపతికి 7గురు భార్యలు. ఆ ఏడుగురు భార్యలకు వరుసగా---
ధూమ్రకు ధరుండు
బ్రహ్మవిద్యకు ధృవుండు
మనస్వినికి సోముడు
రతకు నహుడు
శ్వసకు అనిలుడు
శాండిలికి అగ్ని
ప్రభాతకు ప్రత్యూష, ప్రభాసులనే ఎనమండుగురు వసువులు పుడతారు.
  • ధరుండనే వసువుకు ద్రవిణుడు, హుతహవ్యవాహనుడు
  • ధ్రువుండు అనే వసువుకు కాలుడు పుట్టె.
  • సోముండనే వసువుకు (భార్య మనోహర) వర్చసుండు, శిశిరుండు, ప్రాణుండు, రమణుండు, మరియు పృథ అనే కూతురూ కలిగారు. ఆ పృథకు ౧౦ మంది గంధర్వపతులు పుట్టారు.
  • యహుండను వసువుకు జ్యోతి పుట్టింది
  • అనిలుండు అనే వసువునకు (భార్య శివ) మనోజవుడు, అవిజ్ఞాతగతి పుట్టారు.
  • అగ్ని అనే వసువునకు కుమారుడు పుట్టాడు.
  • ప్రత్యూషుడనే వసువునకు దేవలుడు (ఋషి)
  • ప్రభాసుడనే వసువునకు(భార్య బృహస్పతి చెల్లెలు ఐన యోగసిద్ధికి) విశ్వకర్మ పుడతాడు.(గొప్ప శిల్పి)
స్థాణునికి ఏకాదశమానసపుత్రులు మృగ, వ్యాధ, శర్వ, నిరృత, ఏకపాద, అహిర్భుధ్న్య, పినాకి, దహనేశ్వర, కపాలి, స్థాణు, భర్గులు .
బ్రహ్మ దక్షిణ స్థనము---ధర్ముండనే మనువు-----శమ, కామ, హర్షులు అనే ముగ్గురు పుట్టారు.
శమ(భార్య ప్రాప్తి), కామ(భార్య రతి), హర్ష(బార్య నంద)
సవితృ(భార్య బడబారూపధారిణి యైన త్వాష్ట్రి)---ఆశ్విని మొదలగువారు పుట్టారు.
బ్రహ్మ హృదయం నుండి భృగుమహర్షి----కవి-----శుక్రాచార్యులు(రాక్షస గురువు)----చండామర్కులు, త్వష్ట్ర, ధర, అత్రు లనే 4గురు పుట్టారు.(అసురులకు యాజ్ఞికులు)
భృగుడు--చ్యవనుడు(భార్య మనుకన్య)---ఊరుల ద్వారా ఔర్యుడు---100మంది ఋచీకుడు మొదలగువారు పుట్టారు.
ఋచీకుడు---జమదగ్ని-----4గురు కొడుకులు పరశురాముడు మొదలగువారు
బ్రహ్మ ---ధాత, విధాత (మనుసహాయులుగా పుట్టారు) వారితో పాటు లక్ష్మి --అనేకమంది మానస పుత్రులు పుట్టారు.
వరుణునకు జ్యేష్టకు బలుడు, సుర అనే కూతురు---అధర్ముడు(భార్య నిరృతి)--భయ, మహాభయ, మృత్యువు 3గ్గురు.
తామ్ర---5గురు కుమార్తెలు కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్రి, శుకి.
కాకి---ఉలూకంబులు , శ్యేని---శ్యేనంబులు(డేగలు), బాసి---భాస గృధాదులు, ధృతరాష్ట్రికి--హంస చక్రవాకములు, శుకి---శుకంబులు,
క్రోధుడు---9గురు మృగి, మృగమంద, హరి, భద్రమనస, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస.
  • మృగి---మృగంబు
  • మృగమంద---ఋక్ష చమర సృమరాదులు
  • హరి---వానర గణములు
  • భద్రమనస----ఐరావణము---దేవనాగంబులు
  • మాతంగి-----గజములు
  • శార్దూలి----సింహ వ్యాఘ్రంబులు
  • శ్వేత---దిగ్గజములు
  • సురభి---రోహిణి, గంధర్వి,ననల పుట్టారు. రోహిణికి పశుగణము, గంధర్వికి హయములు, ననలకు గిరివృక్షలతాగుల్మంబులు పుట్టినవి
  • సురస---సర్పంబులు. ఇది సర్వ భూత సంభవ ప్రకారము.౭౧
చ.
దివిజ మునీంద్ర దానవ దితిప్రభవాది సమస్త భూత సం
భవముఁ గృతావధానులయి భక్తి మెయిన్ వినుచున్న పుణ్యమా
నవులకు నిక్కువంబగు మనఃప్రియ నిత్య సుఖంబులు జిరా
యువును బహుపుత్ర లాభ విభవోన్నతియున్ దురితప్రశాంతియున్.72
దురితప్రశాంతి=పాపశమనము
Unknown
ఆది పర్వము-తృతీయాశ్వాసము-౫
భీష్మాది వీరులు దేవదానవాదుల యంశంబు వలనఁ బుట్టుట
సీ.
పరశురాముండు భీకరనిజకోపాగ్ని నుగ్రుఁ డై యిరువదియొక్కమాఱు
ధాత్రీతలం బపక్షత్రంబు సేసినఁ దత్క్షత్త్ర సతులు సంతాన కాంక్ష
వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయఁ జేసి ధర్మువు దప్పకుండఁ
బడసిరి పలువురఁ గొడుకులఁ గూఁతుల నిప్పాటఁ దత్క్షత్త్రమెసఁగి యుర్వి
ఆ.
బర్వి రాజధర్మ పథనీతి విడువక, జార చోర దుష్ట జనులబాధఁ
బొరయకుండ నిఖిల భూప్రజాపాలనఁ, జేయుచుండె శిష్ట సేవ్యమగుచు.౫౧
పరశురాముడు ఇరవై వొక్క మాఱులు భూలోకమంతా తిరిగి క్షత్రియులందరిని చంపివేసినపుడు ఆ క్షత్రియ స్త్రీలు ఋతుకాలములో మహావిప్రులవలన ధర్మము తప్పకుండా అనేకమంది కొడుకులను కూతుళ్ళను కన్నారు. వారంతా రాజధర్మాన్ని విడిచిపెట్టకుండా జార చోర దుష్టజనుల బాధ లేకుండా పరిపాలన చేయగా సకల సస్యసమృద్ధి ప్రజాభివృద్ధి జరిగి భూదేవి ప్రజాభారపీడిత అయ్యింది. ఆమె త్రిమూర్తులను భూభారం తగ్గించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు దేవ రాక్షసాంశమ్ములతో పాండవపక్ష వీరులను శిశుపాలాదులు మొదలుగాగల కురురాజుపక్ష రాజులను సృష్టి చేయగా వారందరు భారత సంగ్రామంలో ఒకరితో ఒకరు యుద్ధం చేసి చచ్చిపోతారు. ఆ విధంగా భూభారం తగ్గుతుంది.

బ్లాగ్మిత్రులందరికీ విన్నపం.
--౨౦౦౯ నుండి ప్రారంభించి భక్తి టీ.వి. వారు ప్రతిరోజు రాత్రి గంటలకు, తిరిగి రాత్రి ౧౧ గంటలకు బ్రహ్మశ్రీ మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానంతో శ్రీమదాంధ్రమహాభారతాన్ని ప్రసారం చేస్తున్నారు. వీలైతే చూడగలరు.
Unknown
విరాట పర్వము-ప్రథమాశ్వాసము-౭
ధౌమ్యుఁడు పాండవులకు సేవాధర్మము లెఱింగించుట
ఉ.
ఎండకు వాన కోర్చి తనయిల్లు ప్రవాసపుఁ జోటు నాక యా
కొండు నలంగుదున్ నిదురకుం దఱి దప్పెను డప్పి వుట్టె నొ
క్కండన యెట్లొకో యనక కార్యము ముట్టినచోట నేలినా
తం డొక చాయ చూపినను దత్పరతం బనిసేయు టొ ప్పగున్.౧౩౫

సేవకుడనేవాడు ఎండకు వానకు ఓర్చుకోవాలి. తన యిల్లు చాలా దూరం అని అనక ఆకలవ్వుతుంది, అలసిపోయాను, నిదరపోవడానికి కాలమయింది, దప్పికవుతుంది, ఒక్కడ్నే ఎలా చెయ్యను, అని సణగకుండా రాజుగారు ఓదారి చూపితే
పనిచేయాల్సినచోట అదే ధ్యాసతో పని చేయటం మంచిదవుతుంది.
క.
తా నెంతయాప్తుఁ డై నమ,హీనాయకు సొమ్ము పాము నెమ్ములుగా లో
నూనినభయమునఁ బొరయక, మానినఁ గాకేల కలుగు మానము బ్రదుకున్.౧౩౬

రాజుకు తానెంత ఆప్తుడైనా సరే రాజుగారి ధనం పాముతలమీది మణిలా లోన భయముకలిగి ప్రవర్తించకపోతే మానము బ్రదుకు కూడా దక్కవు.
ఆ.
ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ,నంబు గుప్తవర్తనములు గాఁగఁ
జలుపవలయు నృపతి కొలువున్న యెడల బా,హిరము లైనఁ గెలని కెగ్గు లగుట.౧౩౭

రాజుగారు కొలువున్నప్పుడు ఆవులింత, తుమ్ము, నవ్వు, ఉమియుట -ఇవి ఇవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి. బయటకు తెలిస్తే అందరి దృష్టి నీమీదే వుంటుంది.
క.
వైరుల దూతలు నెర వగు, వారు నిరాకృతులుఁ బాపవర్తులుఁ దమకుం
జేరువగా వర్తించుట, నేరమి తుదిఁ బోయి చేటు నిందయు వచ్చున్.౧౩౮

శత్రురాజుల దూతలు , నెరవగువారు(?), రూపము లేనివారు, పాపవర్తులు - తమకు చేరువగా మెలగటాన్ని సేవకులు తెలుసుకోలేకపోతే చివరకు చేటు, నింద కూడా కలిగిస్తారువాళ్ళు.
ఆ.
వసుమతీపాల వర్తించు నేనుంగు, తోడ నైన దోమతోడ నైన
వైరమగు తెఱంగు వలవదు తా రెంత, పూజ్యు లైన జనులపొందు లెస్స.౧౩౯

రాజు గారి దగ్గరగా వర్తించే ఏనుగు వంటి వారితో గాని దోమ లాంటి వారితోగాని వైరము పూనటం తగదు. అటువంటి వారితో స్నేహమే మంచిది.
క.
కలిమికి భోగముల కదా, ఫల మని తను మెఱసి బయలుపడఁ బెల్లుగ వి
చ్చలవిడి భోగింపక వే,డ్కలు సలుపఁగ వలయు భటుఁ డడంకువతోడన్.౧౪౦

ధనము ఉంది కాబట్టి భోగించాలని అట్టహాసంగా విచ్చలవిడిగా ఉండకుండగా అణకువతో నే మెలగాలి.ఇవన్నీ సేవకులు రాజులపట్ల చూపించాల్సిన పాటించాల్సిన సేవాధర్మములు. అజ్ఞాత వాస సమయంలో పాండవులు రాజు దగ్గఱ సేవలు చేస్తూ ఉండాల్సి ఉంది కాబట్టి వారి పురోహితు డైన ధౌమ్యుడు పాండవులకు ఇవన్నీ పాటించాలని ఉపదేశిస్తాడు. ఈ కాలానికైనా ఏ కాలానికైనా ఇవే ధర్మాలు అందరు సేవకులకూ కూడా వర్తిస్తాయి.
Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౭
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము
సీ.
క్రోధంబు పాపంబు గ్రోధంబునన చేసి యగుఁ ధర్మ కామార్థహాని
కడుఁ గ్రోధి కర్జంబు గానండు క్రుద్ధుండు గురునైన నిందించుఁ గ్రుద్ధుఁ డై న
వాఁడవధ్యుల నైన వధియించు మఱియాత్మఘాతంబు సేయంగఁ గడఁగుఁ గ్రుద్ధుఁ
డస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి క్రోధంబు దాల్చుట గుణమె చెపుమ
ఆ.వె.
యెఱుక గల మహాత్ముఁ డెఱుక యన్జలముల, నార్చుఁ గ్రోధ మను మహానలంబు
గ్రోధవర్జితుండు గుఱుకొని తేజంబు, దాల్చు దేశకాలతత్వ మెఱిఁగి.౨౨౨

క్రోధం - పాపం. దానివలన ధర్మ,అర్థ,కామాలకు హాని కలుగుతుంది. ఎక్కువ కోపి యైనవాడు కార్యముపై దృష్టి పెట్టలేడు, గురువు నైనా నిందిస్తాడు, వధింపగూడని వారిని వధిస్తాడు, చివరకు తనకు తానే హాని చేసుకుంటాడు. మావంటి ధర్మాన్ని అనుసరించే వారికి క్రోధాన్ని దాల్చటం గుణమా? క్రోధమనే గొప్ప అగ్నిని ఎఱుక అనే జలంతో ఎఱుక గలిగిన మహాత్ములు ఆర్పివేస్తారు. దేశకాలతత్వాన్ని ఎఱిగి క్రోధవర్జితు డైనవాఁడు తేజస్సును పొందుతాడు.
క.
క్షమ గలవానికిఁ బృథ్వీ,సమునకు నిత్యంబు విజయసంసిద్ధి యగున్
క్షమ యైనవానిభుజవి,క్రమము గడున్ వెలయు సర్వకార్యక్షమ మై.౨౨౩

క్షమకలవాడు భూదేవితో సమానుడు వానికి ఎప్పుడూ విజయం చేకూరుతుంది. సర్వ కార్యములయందును క్షమాగుణము కలవాని భుజవిక్రమము ప్రకాశిస్తుంది.
వ.
తేజః ప్రభవంబు లైన యమర్ష దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు క్షమావంతునంద వీర్యవంతంబు లగుఁ దొల్లి కశ్యపగీత లైన గాథలయం దీయర్థంబు వినంబడు వినుము వేదంబులు యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగ మంతయు క్షమయంద నిలిచినవి తప స్స్వాధ్యాయయజ్ఞ కర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు వడయుదురు.౨౨౪
అమర్ష=కోపము
ఇలా చెప్పి ద్రౌపది ఇంకా వాదానికి దిగితే ఆమెతో ధర్మరాజు
వ.
నాస్తికులయట్లు ధర్మాభిశంకిని వై దైవదూషణంబు సేసెదు శిష్టచరితం బయిన ధర్మంబు నధిక్షేపించు చున్న దుర్మతికిం బ్రాయశ్చిత్తంబు లేదు ధర్మువు దప్పక నిత్యులై జీవించు చున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ఠ నారదప్రభృతులం బరమ యోగధరులం బ్రత్యక్షంబ చూచెదము వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతు రన్యు లన్యాయంబు సేసి రనియు నే నేల ధర్మువు దప్పుదు.౨౨౮
క.
ధీరమతియుక్తిఁ జేసి వి,చారింపఁగ నిక్కువంబు సర్వజనస్వ
ర్గారోహణసోపానం, బారఁగ ధర్మంబ చూవె యతిరమ్యం బై.౨౨౯

అదీ ధర్మరాజు ధర్మ నిరతి. అందుకేనేమో స్వర్గారోహణ పర్వం చివరలో ధర్మరాజు మాత్రమే వెంట వచ్చిన కుక్కతో కలసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలగటం జరుగుతుంది.
Unknown
ఉద్యోగ పర్వము-ప్రథమాశ్వాసము-౮
ఇంద్రుడు నహుషుతేజోవిశేషంబు చూచి మఱుఁగువడుట.
శచీ దేవి నహుషునితో కొంతకాలం గడువు కోరివచ్చిన పిదప అందరూ కలసి ఆలోచించుకొని విష్ణుదేవు పాలికి రహస్యంగా పోయి సహాయం కోరగా ఇంద్రునిచే అశ్వమేధ యాగం చేయిస్తే అతని పాపం నశిస్తుందని సలహా యిస్తాడు. అలా అశ్వమేధ యాగం చేసి పాపాలను పోగొట్టుకొని ఇంద్రుడు నహుషుని వద్దకు వెళ్ళి ఆతని తేజస్సు చూచి భయకంపితుడై పారిపోయి ఎక్కడో దాగుకొంటాడు.
శచీ దేవి ఆకాశవాణిని ప్రార్థించి ఆకాశవాణి సహాయంతో ఇంద్రుని కలసి నహుషుని పోకలు అతనిని తాను గడువు కోరటం వగైరా తెలియజేస్తుంది.అప్పుడామెతో ఇంద్రుడు
క.
ఆ నహుషు బాహుగర్వ మ,నూనం బై యున్నయది సముజ్జ్వల మునిస
న్మాన ప్రవృద్ధ మగుటను, దానం గాలంబు వేచెదను జయమునకున్.౧౭౫
సముజ్జ్వల మునిసన్మాన ప్రవృద్ధము=ప్రకాశించు మహర్షుల యాదరముఁ బెరిగినది.
చ.
తఱి యగునంతకున్ రిపు నుదగ్రత సైచుట నీతి నీవు నా
కఱపినయట్ల చేయుము తగం జని యాతనిఁ గాంచి నన్ను నె
త్తెఱఁగున నైనఁ బొందఁగ మదిం దలపోఁతయ కల్గెనేనిఁ గ్ర
చ్చఱ మునివర్గవాహనుఁడ వై చనుదెమ్మను మంతఁ దీరెడున్.౧౭౬

సమయం వస్తే గాని యేమీ చెయ్యలేం. నిన్ను పొందాలని అతనికుంటే మునివర్గాన్ని వాహనంగా చేసుకొని రమ్మని చెప్పు. అని శచీ దేవికి చెప్తాడు.
శచీదేవి నహుషుడిని అలానే కోరగా దానికి సమ్మతించి సప్తర్షిగణ వాహన సమేతుడనై వస్తానని చెప్పి అలానే రావటానికి ప్రయత్నిస్తాడు.
శచీ దేవి బృహస్పతిని రక్షింపవేడగా అతడు అగ్నిదేవుడిని పిలిచి ఇంద్రుని వెదికి రమ్మని పంపిస్తాడు. అగ్ని అన్నిచోట్లా వెదకి ఇంద్రుని జాడ కనుక్కోలేక తిరిగివచ్చి బృహస్పతితో ఇలా అంటాడు.
వ.
-----నాకు జలంబులు ప్రవేశింపరామి నంద పరికింప నేరనైతి నప్పుల వలన నగ్నియు బ్రాహ్మణులవలన క్షత్రియజాతియు నశ్మంబులవలన లోహంబును నుద్భవించె వాని వాఁడిమి యెల్ల యెడలనుం జెల్లుఁ దమతమ జన్మస్థానంబులయం దడంగుం గావున నీళ్ళు నాకు సంక్షయంబు సేయుట ప్రసిద్ధంబనిన విని యనిమిషగురుండు హవ్యవాహను నత్యంత గౌరవంబునం గనుంగొని.౧౮౫
అశ్మంబులు=ఱాళ్ళు
బృహస్పతి అగ్నికి తన మంత్రబలంచే అన్నిచోట్లకు వెళ్ళే వీలు కలిగించగా అగ్ని తిరిగివెళ్ళి ఇంద్రుని వెదకి పట్టుకుంటాడు. అక్కడికి మునులందరితో కలసి వెళ్తారందరూ.బృహస్పతి ఇంద్రునితో
క.
శరనిధి ఫేనంబున నా, హరి పొంది జగద్విరోధి యగు వృత్రునిఁ దా
బరిమార్ప నీకు విజయము, దొరకొనియెం గాక దీన దోసము గలదే.౧౯౦
వ.
అని సముచితంబుగా సంబోధించిన గురుని సంభాషితంబుల నిర్దోషితుండయి----౧౯౧
------నహుషు గెలుచు నుపాయంబు విచారించు నవసరంబున.౧౯౭
క.
కష్టుం డగునానహుషుఁడు, నష్టాత్మకుఁ డయ్యె దివిజనాయక నీయు
త్కృష్ట చరితమున సురలకుఁ, దుష్టిగ నిజరాజ్యసంగతుఁడ వగు మనుచున్.౧౯౮
కష్టుండు=పాపి
క.
మునివరుఁ డైన యగస్త్యుఁడు, చనుదెంచిన శతమఖుండు సమ్మతి నుచితా
సనమిడి యర్ఘ్యముఁబాద్యము, నొనరిచి యిట్లనియె సవినయోక్తి నతనితోన్.౧౯౯

అగస్త్యు డింద్రునకు నహుషుభ్రష్టత దెలుపుట.
వ.
అనిన విని యమ్మునీంద్రుండి ట్లనియె నన్నహుషుని మోచివేసరుచున్న మునులతనికడ గోష్టీవినోదంబుల నుండి బ్రాహ్మణంబు లయిన మంత్రంబులు గోసంప్రోక్షణంబునందు జెప్పఁబడి యుండునవి నీకుఁ బ్రమాణభూతంబు లగునే యని యడిగినం బాపనిశ్చయుం డై యతం డమ్మంత్రంబులు బ్రమాణంబులుగావనిన నే నమ్మాట నిషేధించి పూర్వాచార్యులచేత నభినందితంబు లగు మంత్రంబుల నిందించుట యజ్ఞానం బని వివాదంబు సేసిన నతండు కోపించి మదీయ మస్తకంబు దన్నిన నతనిం గనుంగొని పుణ్యహీనుండును దేజో(హాని)దీనుండును నగుట యుపలక్షించి నీవు పూజనీయు లయిన మహామునుల నిన్ను వహింపంబనిచితి వారలు కొనియాడుమంత్రంబుల గర్హించి తదియుంగాక నన్ను నవమానించితి గావున నింద్ర పదభ్రష్టుండ వై బహుసంవత్సరంబులు భూలోకంబున నురగంబ వై యుండు మని శాపం బిచ్చి పదంపడి యనుగ్రహించి భవదీయ వంశజాతుం డయి యజాతశత్రుం డవుపెంపు గలిగి యుథిష్ఠరనామధేయుండైన యొక్క సత్పురుషుని సందర్శనంబున దురితంబులఁబాసి పుణ్యలోకంబు బడయు వాఁడ వనిన దత్క్షణంబ,౨౦౧
క.
స్వర్గ పద భ్రష్టుం డై , దుర్గతికిం బోయె నతఁడు దుశ్టాత్ములకున్
దౌర్గత్యము సుజనులకు, న నర్గళసద్గతియు నగుట యరుదే యెందున్.౨౦౨

ఈవిధంగా ఇంద్రుడంతటివానికే కష్టములు పడక తప్పలేదు.
క.
కావున మీపడినయర,ణ్యావాసక్లేశమునకు నజ్ఞాతవిధిన్
సేవకుల రైనదానికి, నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరై.౨౦౮

అని శల్యుఁడు ధర్మరాజుతో పలికెను.


Unknown
అరణ్య పర్వము-ప్రథమాశ్వాసము-౭

ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము
వ.
క్షమయును దేజంబును నయ్యయి కాలంబులఁ బ్రయోగింప నేరని రాజునకుం బ్రజానురాగ ప్రతాపంబులు లే వను నీయర్థం బితిహాసంబున వినంబడు క్షమా తేజంబులలోన నెయ్యది విశేషంబు దానిని నిర్ణయించి చెప్పుమని బలీంద్రుండు తొల్లి తన పితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె.౨౧౬
ఆ.వె.
క్షమయ తాల్చియుండఁజన దెల్లప్రొద్దుఁ దే, జంబ తాల్చి యుండఁజనదు పతికి
సంతత క్షముండు సంతత తేజుండు, నగుట దోష మందు రనఘమతులు
.౨౧౭
వ.
ఎట్లనిన నిత్యక్షమాన్వితుం డయినవానికి భృత్యులు వెఱవక యవమానంబు సేయుదు ర ర్థంబులయం దధికృతుం డైన వాఁ డతిక్రూరదండంబున సర్వజనసంతాపంబు సేయుచు గృహగతం బైన సర్పంబునుంబోలె నెప్పుడు నుద్వేగకరుండగుం గావున గాలోచితంబుగా క్షమాతేజంబులు గల్పించునది యథాకాల కల్పితక్షమాతేజుం డైన వానికి నుభయలోకసిద్ధి యగు నని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది యిట్లనియె.౨౧౮
క.
ఇది తేజంబున కవసర, ముదితక్రోధుండ వగుమ యొక్కించుక దు
ర్మదు లగు సుయోధనాదుల, నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్
.౨౨౦
వ.
అనిన ధర్మరాజిట్లనియె.౨౨౧
భారత ఇతిహాసం లో మనకందరికీ ఏరుకున్నవారికి ఏరుకున్నన్ని నీతులు కుప్పతిప్పలుగా తటస్థపడు తుంటాయి. మనదే ఆలస్యం. రండి మనందరం కలసి రత్నాల్ని ముత్యాల్ని ఏరుకొని భద్రపరచుకుందాం.
Unknown
విరాట పర్వము- ప్రథమాశ్వాసము-౬
ధౌమ్యుడు పాండవులకు సేవాధర్మములు సెప్పుట
చ.
ధరణిపు చక్కఁ గట్టెదురు దక్కి పిఱుందును గానియట్లుగా
నిరుగెలనం దగం గొలిచి యే మనునో యెటు సూచునొక్కొ యె
వ్వరిదెస నెప్పు డేతలఁపు వచ్చునొ యీతనికంచుఁ జూడ్కి సు
స్థిరముగఁ దన్ముఖంబునన చేర్చుచు నుండుట నీతి కొల్వునన్.౧౨౯

సేవకుడు రాజులదగ్గఱ మెలగాల్సిన విధం గుఱించి చెప్పాడు.
క.
నగళులలోపలిమాటలు, తగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడం బుట్టినఁ బతి విన, నగుపని చెప్పెడిది గాక యాతనితోడన్.౧౩౦

అంతఃపురం విషయాలు బైటికి చేరవేయకూడదు. తనకు బయట తెలిసిన విషయాలు రాజుకు ఉపయోగపడేవైతే అతనితో చెప్పాలి.
క.
అంతిపురము చుట్టరికం, బెంతయుఁ గీ డంతకంటె నెగ్గు తదీయో
పాంతచరకుబ్జవామన, కాంతాదులతోడిపొందుకలిమి భటునకున్.౧౩౧

అంతఃపురం గొడవలు చాలా సున్నితమైన విషయాలు.అక్కడి స్త్రీలతో పొందుకూడా భటుడైనవానికి నిషిద్ధమైనదే.
ఆ.వె.
ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం,బులును గరుణఁ దమకు భూమిపాలుఁ
డీక తార యెక్కు టెంతటిమన్నన, గలుగువారి కైనఁ గార్య మగునె. ౧౩౨

ఉత్తమమైన ఆసనములు, వాహనములు రాజుగారు తమకు ఇవ్వకుండా వాటిని తమంతట తామేఉపయోగించటం ఎంతటి చనువు గలిగివున్నవారికైనా తగిన కార్యం కాదు.
క.
మన్నన కుబ్బక యవమతి, ద న్నొందిన స్రుక్కఁబడక ధరణీశు కడన్
ము న్నున్న యట్ల మెలఁగిన, యన్నరునకు శుభము లొదవు నాపద లడగున్.౧౩౩

ప్రభువు మన్నన చేసినపుడు పొంగిపోయి, అవమానించినపుడు క్రుంగి పొవటం కాకుండా ఎల్లప్పుడూ ఓకే విధంగా మునుపు వున్నట్లుగానే ఉండేవారికి శుభములు కలుగుతాయి., ఆపదలు తొలగుతాయి.
క.
జనపతి యెవ్వరినైనను, మనుపఁ జెఱుపఁ బూని యునికి మదిఁ దెలియ నెఱిం
గినయేనిఁ దాను వెలిపు, చ్చునె మునుము న్నెట్టి పాలసుండును దానిన్.౧౩౪

ప్రభువు ఎవ్వరిమీదైనా కత్తికట్టిన విషయం తనకు ముందుగా తెలిసినా సరే,దానిని ఎటువంటి మూఢుఢు కూడా ముందుగా బయటపెట్టకూడదు.